Priyank Kharge comes down heavily on BJP govt ఇది ‘లంచం.. మంచం’ ప్రభుత్వం: కాంగ్రెస్ ఎమ్మెల్యే

Priyank kharge calls bjp dispensation in karnataka as bribe couch govt

congress, priyank kharge, bribery, corruption, karnataka recruitment scam, BJP-ruled government, government job, karnataka, Politics

Karnataka Congress leader Priyank Kharge started a political tussle by making grave allegations against the BJP-ruled government in the state when he said that men “have to bribe” to get a government job in Karnataka while “young women have to sleep with someone” for the same.

ఇది ‘లంచం.. మంచం’ ప్రభుత్వం: బీజేపి సర్కార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ధ్వజం

Posted: 08/13/2022 06:53 PM IST
Priyank kharge calls bjp dispensation in karnataka as bribe couch govt

బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వారి అర్హత బట్టి కాకుండా లంచం, మంచం ఆధారంగా నియామకంగా జరుగుతోందని మల్లిఖార్జున్ ఖార్గే తనయుడైన ప్రియాంక ఖార్గే ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే యువకులు లంచం ఇవ్వాలి, యువతులు మంచం ఎక్కాల్సి వస్తుందని ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

కలబురగిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రియాంక ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని ప్రకటించుకున్న బొమ్మై- పాలనలో పూర్తిగా విఫలమయ్యారని ఖర్గే అన్నారు. ప్రభుత్వం అన్ని ఉద్యోగాలనూ తమకు ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్మకాలకు పెట్టారని,  విధానసౌధ వ్యాపారసౌధగా మారిందని ఆయన ఆరోపించారు. యువతతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆరోపించారు. అక్రమాలను బయటపెట్టిన తనను సీఐడీ అధికారులతో నోటీసులు పంపించి బెదిరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles