MLA Komatireddy Rajagopal Reddy resignation approved కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా అమోదం..

Komatireddy rajagopal reddy resignation as munugode mla approved

congress MLA, Komatireddy Rajagopal Reddy, Munugodu, Nalgonda, Assembly Speaker, Pocharam Srinivas Reddy, Congress, BJP, Telangana, Politics

Putting an end to speculation, senior Congress leader MLA from Telangana’s Munugode constituency, Komatireddy Rajagopal Reddy met Telangana Assembly Speaker Pocharam Srinivas Reddy on Monday and submitted his resignation letter, after a week of his announcement his resignation from the Congress party and also as a legislator.

మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం

Posted: 08/08/2022 01:26 PM IST
Komatireddy rajagopal reddy resignation as munugode mla approved

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేసినట్ల ప్ర‌క‌టించారు. కాగా, ఆయన ఇవాళ తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ఆయన రాజీనామాను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్‌ కార్యాలయం పేర్కొంది.

నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో మునుగోడు శాసనసభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన రాజగోపాల్‌రెడ్డి.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందించిన రాజీనామా పత్రాన్ని పరిశీలించిన స్పీకర్ దానిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే నోముల నర్సింహయ్య అకాలమృతితో నల్గోండ జిల్లాలోని నాగార్జున్ సాగర్ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh