Tirumala Annual Pavithrotsavam begins from today మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు..

Tirumala annual pavithrotsavam begins from today on sravan ekadasi

ttd srivaru, ttd annual pavithrotsvam 2022, ttd annual pavithrotsavam, lord balaji, Pavithrotsavam, Tirumala, YV Subba Reddy, Andhra Pradesh

Tirumala Tirupati Devasthanams (TTDs) celebrates Srivari Pavithrotsavam every year on the important days of Ekadasi, Dwadasi and Trayodasi in the month of Sravana as per Hindu calendar. This festival is known as “Festival of Purification”. This festival was first instituted by Saluva Mallaiah Deva Raja in 1463 A.D. at Tirumala during the period of Saluva Narasimha as per the inscription 157 present in Srivari Temple.

తిరుమలలో మూడు రోజుల పాటు మలయప్పస్వామి పవిత్రోత్సవాలు..

Posted: 08/08/2022 12:20 PM IST
Tirumala annual pavithrotsavam begins from today on sravan ekadasi

కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం రోజునే అర్చకులు ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అంతకముందు శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్‌ సేనుల వారిని మాడవీధుల్లో ఊరేగింపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి.

వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు జరగనున్న సందర్భంగా... మూలవిరాట్‌ ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శనమిస్తారు. ఉత్సవాల్లో మొదటి రోజైన సోమవారం పవిత్రాల ప్రతిష్ట, 9న పవిత్ర సమర్పణ, 10న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా.. పవిత్రోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్జితసేవలను రద్దు చేసింది. మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణసేవలతో పాటు 9న శ్రీవారి ప్రధాన ఆలయంలో జరిగే అష్టదళపాదపద్మారాధన కార్యక్రమాన్ని సైతం రద్దు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles