BJP's Shrikant Tyagi pays BIG PRICE for abusing woman మహిళపై అనుచితంగా ప్రవర్తించిన బీజేపి నేత.. పోలీసుల ఎంట్రీతో పరార్

Noida police slap gangster act on shrikant tyagi who assaulted woman in housing society

Noida Viral Video, Shrikant Tyagi, Noida BJP leader abuses woman, Noida BJP, BJP Noida,noida viral video, shrikant tyagi, Noida BJP leader abuses woman, Noida BJP, BJP Noida, UP Government vehicle, Toyota Fortuner, Tata Safari, Honda Civic, Noida, Noida Housing Society, Uttar Pradesh

Following Uttar Pradesh government's zero-tolerance policy, Noida police slapped Gangster Act on Shrikant Tyagi and his properties are likely to be attached, as per sources. Tyagi is accused of allegedly assaulting a woman after a spat at a housing society in Noida.

మహిళపై అనుచితంగా ప్రవర్తించిన బీజేపి నేత.. పోలీసుల ఎంట్రీతో పరార్

Posted: 08/08/2022 02:27 PM IST
Noida police slap gangster act on shrikant tyagi who assaulted woman in housing society

ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మ‌హిళ‌తో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్య‌క‌ర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినా.. ఇప్పటి వరకు అచూకీ తెలియరాలేదు. కాగా పోలీసు బీజేపి నేత భార్యతో పాటు అతని డ్రైవర్, మేనేజర్లకు కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక పారారీలో వున్న శ్రీకాంత్ త్యాగి ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిసిన వారికి రూ.25 వేల నగదు బహుమతి ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు.

సోసైటీకి చెందిన స్థలాన్ని కబ్జా చేసే ప్రణాళికలో భాగంగా ఆయన అక్కడ చిన్నా, పెద్ద చెట్లను నాటుతూ వస్తున్నారని, కాగా దీనికి అభ్యంతరం చెప్పినవారిపై ఆయన అసభ్యంగా మాట్లాడుతూ.. వారి పరువు తీస్తున్నారని అరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అదే సోసైటీకి చెందిన ఓ మహిళా.. బీజేపి నేత తీరును.. ఆయన చేస్తున్న కబ్జాయత్నాలను నేరుగా నిలదీయగా, సహనం కోల్పోయిన శ్రీకాంత్ త్యాగీ.. నోటి దురుసుతో విరుచుకుపడ్డారు. అసభ్యకరంగా దూషిస్తూ.. దుర్బాషలాడుతూ.. చెలరేగిపోయాడు. తన చెట్ల వద్దకు వస్తే ఎవరినైనా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇవ్వడం కూడా వీడియోలో కనిపించింది.

ఈ వీడియోలను సోసైటికీ చెందిన ఇతరసభ్యులు బీజేపి నేతకు తెలియకుండా రహస్యంగా తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించి.. వాటిని నెట్టింట్లో పోస్టు చేయడంతో అవికాస్తా విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఓ సందర్భంలో సహనం కోల్పోయిన ఆయన.. మహిళను అక్కడి నుంచి వెళ్లిపోవాలని అదేశిస్తూ అమెను వెనక్కు నెట్టాడు. దీంతో మహిళ వెనక్కు తుళ్లిపడి వెంటనే తనను తాను బ్యాలెన్స్ చేసుకుంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో.. జాతీయ మహిళా కమీషన్ జోక్యం చేసుకుంది. తక్షణం శ్రీకాంత్ త్యాగిని అరెస్టు చేయాలని డిల్లీ పోలీసులను అదేశించింది. పోలీసులు అతని కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

ఇక నోయిడా అధికారులు శ్రీకాంత్ త్యాగి ఇంటి వ‌ద్ద ఉన్న అక్ర‌మ నిర్మాణాన్ని కూల్చివేశారు. బుల్డోజ‌ర్‌తో అక్ర‌మ నిర్మాణాన్ని తొల‌గించడంతో గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీ మహిళలు తమ హర్షాతిరేకాన్ని ప్రదర్శించారు. సీఎం యోగి నిర్ణ‌యం ప‌ట్ల సంతోషంగా ఉంద‌ని స్థానికులు అన్నారు. నోయిడా సెక్ట‌ర్ 93బీలో నివ‌సిస్తున్న ఓ మ‌హ‌ళ‌తో బీజేపీ నేత త్యాగి అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆ ఘ‌ట‌న‌లో ఐపీసీ కింద కేసు బుక్కైంది. ప్ర‌స్తుతం శ్రీకాంత్ త్యాగి ప‌రారీలో ఉన్నాడు. త్యాగిపై గ్యాంగ్‌స్ట‌ర్ చ‌ట్టం కింద కేసు బుక్ చేశారు. శ్రీకాంత్ త్యాగి అక్ర‌మంగా సొసైటీ పార్క్‌ను క‌బ్జా చేశాడు. దీంతో స్థానికులు ఆగ్ర‌హానికి లోన‌య్యారు. నోటీసులు ఇచ్చినా ప‌ట్టించుకోకుండా.. అక్ర‌మ నిర్మాణాన్ని చేప‌ట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles