World Bank has no new financing plans for crisis-hit Sri Lan శ్రీలంకకు ఆర్థిక సహాయం అందించే ఆలోచనేమీ లేదు..!

World bank has no new financing plans for crisis hit sri lanka deep structural reforms needed

world bank sri lanka, World Bank, Sri Lanka, Structural reforms, economic stabilisation, foreign exchange, sri lanka,sri lanka crisis, world bank,international monetary fund,ranil wickremesinghe,world bank group,raju gopalakrishnan,gotabaya rajapaksa,World Bank new financing plans for crisis Sri Lanka

The World Bank on Thursday said it does not plan to offer Sri Lanka any new financing amid the ongoing economic crisis, citing inadequate macroeconomic policy framework. The international financing institution said that it was ‘deeply concerned’ about the impact of the crippling crisis on the people of Sri Lanka.

శ్రీలంకకు ఆర్థిక సహాయం అందించే ఆలోచనేమీ లేదు: ప్రపంచ బ్యాంకు

Posted: 07/29/2022 05:38 PM IST
World bank has no new financing plans for crisis hit sri lanka deep structural reforms needed

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకను గాడిలో పెట్టేందుకు ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. శ్రీలంకను అదుకునేందుకు ప్రపంచబ్యాంకు కూడా సముఖంగా లేదన్నవార్తలు వినిపిస్తున్న క్రమంలో దానిపై ఆ సంస్థ క్లారిటీని ఇచ్చింది. ప్రస్తుతానికి ఆర్థిక సహాయం అందించే ఆలోచన ఏమీ లేదని ప్రపంచబ్యాంక్‌ పేర్కొంది. లంకలో తగిన స్థూల ఆర్థిక విధానానికి సంబంధించి ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పడే వరకు సాధ్యం కాదని తెలిపింది. శ్రీలంకకు నిర్మాణాత్మకమైన సంస్కరణలు అవసరమని వరల్డ్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

దేశంలో కొనసాగుతున్న సంస్కరణలు ఆర్థిక స్థిరీకరణపై దృష్టి పెట్టాలని సూచించింది. లంకలో ప్రస్తుత పరిస్థితి కారణాలు గుర్తించి.. తొలగించాల్సిన అవసరం ఉందని, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు శ్రీలంక సరళమైన, సమ్మిళిత పద్ధతిలో అభివృద్ధి చెందే విధానాన్ని అవలంభించాలని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, భయంకరమైన ఆర్థిక పరిస్థితి ప్రజలపై చూపుతున్న ప్రభావంపై ఆందోళన చెందుతున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది.

పేద కుటుంబాలకు అవసరమైన మందులు, వంటగ్యాస్, ఎరువులు, పాఠశాల విద్యార్థులకు ఆహారం, ఆర్థిక సహాయం తదితర అవసరమైన వస్తువులను నిర్ధారించేందుకు శ్రీలంకకు ఇప్పటికే జారీ చేసిన రుణ సౌకర్యాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. శ్రీలంకలో నిత్యావసరాల లభ్యతను నిర్ధారించేందుకు ఇప్పుడు 160 మిలియన్ల అమెరికన్‌ డాలర్ల మొత్తాన్ని విడుదల చేసినట్లు ప్రపంచ బ్యాంక్ చెప్పింది. శ్రీలంకలో సహాయక చర్యల్లో నిమగ్నమైన ఇతర మిత్రదేశాల సమన్వయంతో లంక ప్రజలు గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రపంచ బ్యాంక్‌ తరఫున ప్రయత్నిస్తున్నామని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles