TSRTC driver assaulted by Auto Rickshaw Driver నన్నే ఆటో తీయమంటావా?.. బస్‌ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్‌ దాడి!

Tsrtc driver assaulted by auto rickshaw driver at nmdc bus stop in hyderabad

TSRTC driver assaulted by Auto Driver, TSRTC driver assaulted at NMDC bus stop, Auto driver assaults TSRTC driver, Auto driver assaults TSRTC driver at NMDC bus stop, TSRTC Bus driver, Auto Rickshaw, auto driver, assault, Humayun nagar police station, masab tank, Mehidipatnam, Hyderabad, Crime

A video of an Auto rickshaw assaulting a TSRTC bus driver and hurling abuses went viral on social media on Friday. The Auto driver was not giving side to the bus, as the bus driver horns sound, he got irritated and jumps into the bus, drags the driver out of the bus and holds his collar and assaults him. The incident reportedly took place in the limits of Humayun nagar police station at NMDC busstop in Hyderabad.

నన్నే ఆటో తీయమంటావా?.. బస్‌ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్‌ దాడి!

Posted: 07/29/2022 07:00 PM IST
Tsrtc driver assaulted by auto rickshaw driver at nmdc bus stop in hyderabad

నగరంలోని ట్రాఫిక్ లో తేలిగ్గా వెళ్లగల ద్విచక్ర వాహనాన్ని నడపడమే అత్యంత కష్టం. ఎటు నుంచి ఎవరు వస్తున్నారో..  ఎవరు ఎందుకు హారన్ కోడుతున్నారో కూడా తెలియదు. అలాంటి ట్రాఫిక్ ను చేధించుకుంటూ ఏకంగా బస్సును నడపడం అంటే అంత ఈజీ కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆర్టీసీ డ్రైవర్ల పని ప్రతీరోజు కత్తి మీద సాములాంటిదే. అలాంటి ఒక సిటీ బస్‌ డ్రైవర్‌పై ఓ ఆటో డ్రైవర్‌ దాడికి పాల్పడ్డాడు. అర్టీసీ డ్రైవర్ ను తన సీటులోంచి బయటకు ఈడ్చుకోచ్చి మరీ దాడికి పాల్పడ్డాడు. సమయానికి బస్సులోని ఫ్యాసింజర్లు అడ్డుగా వచ్చారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే.. డ్రైవర్ పరిస్థితి ఏమైవుండేదో.

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్​ వద్దనున్న ఎన్ఎండీసీ బస్టాపు వద్ద ఇవాళ చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎన్‌ఎండీసీ బస్టాప్‌ వద్ద వద్ద ఆర్టీసీ బస్సులు ఆగేచోట.. ఆటోను నిలుపాడో అటో డ్రైవర్. దీంతో.. బస్‌ డ్రైవర్‌ యాదయ్య తన బస్సు హారన్ ను కోట్టాడు. అది విన్న తరువాత కూడా ఏమాత్రం చలించకుండా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు అన్న చందంగా వ్యవహరించాడు అటో డ్రైవర్. దీంతో బస్సులోంచే ఆటోను పక్కకు తీయాలని అటోడ్రైవర్ ను కోరాడు అర్టీసీ డ్రైవర్ యాదయ్య.

అంతే తననే అటో తీయమంటావా.? అంటూ ఆగ్రహానికి గురైన ఆటో డ్రైవర్‌ బస్సులోకి దూసుకువచ్చి.. డ్రైవర్‌ యాదయ్యను కిందకు లాగుకుంటూ వచ్చి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పలువురు ఆపేందుకు ప్రయత్నించినా దాడికి పాల్పడ్డాడు. వెంటనే కండక్టర్ మధ్యలోకి వెళ్లినా వినిపించుకోలేదు. బస్సులోని ప్యాసింజర్లు దిగి అడ్డుపడటంతో డ్రైవర్ ను విడిచిపెట్టాడు యాదయ్య. గాయపడ్డ యాదయ్యను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్‌ డ్రైవర్‌పై దాడి చేసిన ఆటో డ్రైవర్‌పై హుమాయున్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది. ఆటో డ్రైవర్‌పై దాడిని ఖండించిన ఈయూ ఖండించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles