300 Basara IIIT Students Hospitalized Due to Food Poisoning బాసర IIIT లో 300 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత..

Panic in basara iiit 300 students hospitalized due to food poisoning

food poisoning, Unhygienic conditions, polluted water, IIIT Basar, substandard ingredients, polluted water, food preparations, Nirmal, Telangana, Crime

Several incidents of food poisoning in hostels and of students falling sick are being reported from erstwhile Adilabad district. Unhygienic conditions in the kitchen and mess and use of substandard ingredients, as well as the use of polluted water in food preparations, are cited as the main reasons.

బాసర IIIT లో టెన్షన్ టెన్షన్.. 300 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత..

Posted: 07/15/2022 04:22 PM IST
Panic in basara iiit 300 students hospitalized due to food poisoning

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు విద్యార్థులు ఎగ్ కర్రీ రైస్ భోజనం చేయగా.. కలుషిత ఆహారం తినడంతో అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. సుమారు 1200 మంది విద్యార్థులు వాంతులు చేసుకోగా.. ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వాంతులు చేసుకున్నవారికి వారి వారి హాస్టల్ రూముల్లోనే ఉంచి మాత్రలు ఇచ్చారు. అస్వస్థకు గురైన వారికి అంబులెన్స్‌తో పాటు ఫ్యాకల్టీ కార్లలో త్రిబుల్ ఐటీలోని ఆసుపత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.

కాగా.. గతంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వివిధ సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్​ వీసీని నియమించాలనే డిమాండ్లతో ఆందోళన చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా పోలీసులు మోహరించారు. స్టూడెంట్లకు మద్దతు తెలిపేందుకు వచ్చేవాళ్లను అరెస్ట్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులనూ వదిలకుండా అరెస్టులు చేశారు. విద్యార్థుల నిరసనలపై మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విఠల్​రెడ్డి, కలెక్టర్, ఎస్పీ పలు దఫాలుగా చర్చలు జరిపారు.

తమ సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్​గానీ, మంత్రి కేటీఆర్​గానీ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు పట్టుబట్టారు. ఈ పరిస్థితుల్లో బాసర ట్రిపుల్​ఐటీ విద్యార్థులతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు జరిపి.. ఆందోళనలకు ముగింపు పలికారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని, త్వరలోనే రెగ్యులర్​ వీసీని నియమిస్తామని హామీ ఇచ్చారు. ల్యాప్​టాప్స్​ పంపిణీ, క్వాలిటీ ఫుడ్​ సహా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, స్టూడెంట్స్ తమ ఆందోళన విరమించి క్లాసులకు హాజరుకావాలని కోరారు. ఈ క్రమంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన జరగడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles