Mahankali Temple Bonalu festival begins సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పణ

Secunderabad ujjaini mahankali bonalu begins today

Golconda bonalu, Bonalu festival celebrations, Telangana tradition, Secunderabad Ujjaini Mahankali temple, Secunderabad Ujjaini Mahankali bonalu, Sri Jagadamba Mahankali temple, Ujjaini Mahankali, Bonalu festival, Goddess Ujjaini Mahankali. Golconda fort, Ashadam bonalu, shravanam bonalu, Hyderabad, Telangana, Devotional

The Ujjaini Mahankali temple in Secunderabad, popular for its biggest Bonalu fete, is gearing up for this year’s celebrations on July 17. As usual, lakhs of devotees are expected to visit the temple on that day. The temple authorities are making the arrangements and constant meetings are held to ensure fool-proof security. The first invitation card for the pooja will be given to Chief Minister K. Chandrashekar Rao.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి మంత్రి తలసాని బోనం సమర్పణ

Posted: 07/15/2022 03:30 PM IST
Secunderabad ujjaini mahankali bonalu begins today

ఆషాడ మాసం రావడంతోనే తొలి శుక్రవారం నుంచే తెలంగాణలో మొదలైన బోనాల సందడి.. తొలివారంలో చారిత్రక గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మతల్లికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నెల 3న జగదాంభిక ఎల్లమ్మతల్లికి తొలి బోనం సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. భాగ్యనగర వైభవం ఉట్టిపడేలా.. తెలంగాణ ప్రత్యేకమైన బోనాల ఉత్సవాలను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్; హోం మంత్రి మహమ్మూద్ అలి ఈ ఉత్సవాలలో పాల్గోన్నారు. ఆ తరువాతి వారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం, బోనాల ఉత్సవాలు జరిగాయి.

ఈ నేపథ్యంలో మూడవ అధివారం అంటే ఈ నెల 17న సికింద్రబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో బోనాలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు అత్యంత కన్నుల పండువగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట బందోబస్తుతో ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 17, 18వ తేదీల్లో అమ్మవారి జాతర నిర్వహించనున్నారు. తెల్లవారు జామునుంచే అమ్మవారి ఆలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. .ఉదయం అమ్మవారికి అభిషేకం, ధ్వజారోహణ, శిఖర పూజ నిర్వహించారు. పండుగ వాతావరణంలో మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు ప్రారంభమయ్యాయి.

మహంకాళి అమ్మవారికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు బంగారు బోనంతో బోనం సమర్పించారు. ఈ ఉత్సవాల్లో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, చైర్మన్ లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలోమంత్రి తలసాని తీన్మార్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోనాలతో మహిళల నృత్యాలు, పోతురాజులు, కొలాటం ప్రదర్శనలు అలరించాయి.  ఈ నెల 17 వ తేదీన నిర్వహించే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles