Marredpally Inspector K Nageshwar Rao suspended అత్యాచారం కేసులో మారేడుప‌ల్లి సీఐ నాగేశ్వ‌ర్‌రావు అరెస్ట్

Marredpally inspector placed suspended over kidnap and rape charges

city police commissioner, cv anand, k nageshwar rao, marredpally inspector, marredpally police station, rape charges against CI, arms case against CI, Hyderabad, Karkhana Inspector C Nethaji, Vanasthalipuram, Rachakonda commissionerate, Hyderabad, Telangana, Crime

City Police Commissioner CV Anand placed under suspension Marredpally Inspector K Nageshwar Rao against whom a rape and murder case was booked at Vanasthalipuram. “In view of the rape and arms act registered against the SHO Marredpally K Nageshwar Rao in Vanasthalipuram police station and the report received from CP Rachakonda, he is suspended from service pending detailed enquiry and investigation,” a statement issued by the Hyderabad City Police read.

మారేడుప‌ల్లి సీఐ నాగేశ్వ‌ర్‌రావుపై సస్పెన్షన్ వేటు.. అత్యాచారం కేసులో అదుపులోకి..

Posted: 07/09/2022 03:41 PM IST
Marredpally inspector placed suspended over kidnap and rape charges

హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మారేడుప‌ల్లి సర్కిల్ ఇన్స్ పెక్టర్ నాగేశ్వ‌ర్ రావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆయనపై అత్యాచారం, ఆయుధ చ‌ట్టం కింద కేసు న‌మోదైన‌ట్లు రాచ‌కొండ సీపీ నుంచి హైద‌రాబాద్ సీపీ కార్యాల‌యానికి స‌మాచారం అందింది. దీంతో నాగేశ్వ‌ర్ రావును విధుల నుంచి త‌ప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. బ‌క్రీదు, బోనాల పండుగ బందోబ‌స్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుప‌ల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియ‌మించారు. బాధితురాలి భ‌ర్త‌పై కూడా సీఐ నాగేశ్వ‌ర్ రావు దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మారేడుప‌ల్లి సీఐ నాగేశ్వ‌ర్ రావుపై అత్యాచారం, కిడ్నాప్ ఆరోప‌ణ‌ల‌తో కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. సీఐ నాగేశ్వ‌ర్ రావును వ‌న‌స్థ‌లిపురం పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. నాగేశ్వ‌ర్ రావు ఈ నెల 7వ తేదీన హ‌స్తినాపురం శ్రీ వెంక‌టేశ్వ‌ర కాల‌నీలో నివాస‌ముంటున్న ఓ మ‌హిళ ఇంటికి వెళ్లాడు. ఇంటికి వ‌స్తున్న‌ట్లు ఆమెకు సీఐ ముందే ఫోన్ చేసి చెప్ప‌డంతో.. ఆ విష‌యాన్ని త‌న భ‌ర్త‌కు తెలిపింది. ఇక మ‌హిళ ఇంటికొచ్చిన సీఐ.. ఆమెపై బ‌ల‌వంతంగా అత్యాచారం చేశాడు. ఎదురు తిరిగిన అమెను రివాల్వ‌ర్‌తో బెదిరించి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అర్ధ‌రాత్రి స‌మ‌యంలో బాధితురాలి భ‌ర్త కూడా శ్రీ వెంక‌టేశ్వ‌ర కాల‌నీకి చేరుకుని.. త‌న భార్య‌పై అత్యాచారం చేస్తున్న సీఐని అడ్డుకున్నాడు. దీంతో బాధితురాలి భ‌ర్త‌ను సీఐ రివాల్వ‌ర్‌తో బెదిరించాడు. ఆ త‌ర్వాత ఆ దంప‌తులిద్ద‌రిని కారులో ఎక్కించుకుని ఇబ్ర‌హీంప‌ట్నం వైపు బ‌య‌ల్దేరాడు. అయితే మార్గమధ్యంలో కారు రోడ్డు ప్ర‌మాదానికి గుర‌ైంది. ఇదే అదనుగా బావించిని బాధిత భార్యభర్తలు.. సీఐ నుంచి త‌ప్పించుకుని, వ‌న‌స్థ‌లిపురం పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీఐ నాగేశ్వ‌ర్ రావును వ‌న‌స్థ‌లిపురం పోలీసులు అరెస్టు చేసే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అయనను ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles