India Mourns Shinzo Abe, Tricolour Flies At Half-mast షింజో అబే మృతికి భారత్ నివాళి.. ‘జాతీయ పతకం అవతనం..

National flag at half mast as india mourns assassination of japan s shinzo abe

state mourning for Shinzo Abe, Shinzo Abe, Shinzo Abe death, Shinzo Abe dies, Shinzo Abe passes away, shinzo abe shot, shinzo abe shot video, shinzo abe condition, shinzo abe japan, japan pm, shinzo abe latest news, Japan former PM shot, Japan, assassination, former japan pm shinzo abe, shinzo abe india relations, shinzo abe narendra modi, shinzo abe manmohan singh, shinzo abe updates, japan shinzo abe, pm shinzo abe, japan pm shinzo abe, japan prime minister, shinzo abe twitter, shinzo abe video, prime minister of japan, shinzo abe twitter account, attack on shinzo abe, shinzo abe wife, shinzo abe attack, japan news

The national tricolour at Red Fort, Rashtrapati Bhavan and Parliament House flew at half-mast on Saturday to observe the day-long state mourning announced in the country as a mark of respect for former Japanese PM Shinzo Abe who was assassinated on Friday. Abe was shot in Nara city in western Japan on Friday, while he was delivering a campaign speech.

షింజో అబే మృతికి భారత్ సంతాపం.. జాతీయ పతకం అవతనం..

Posted: 07/09/2022 04:33 PM IST
National flag at half mast as india mourns assassination of japan s shinzo abe

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేని హత్య చేయడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. జపాన్ నారా పట్టణంలో మాట్లాడుతున్న సమయంలో ఓ దుండగుడు రెండు రౌండ్ల పాటు షింజో అబేపైకి కాల్పులు జరిపారు. దీంతో షింజో అబే మరణించారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణంపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అంతేకాదు ఇవాళ ఆయన మరణానికి నివాళిని గటిస్తూ జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. జ‌పాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతికి నివాళిగా శ‌నివారం దేశవ్యాప్తంగా జాతీయ ప‌తాకాన్ని అవ‌న‌తం చేశారు.

ఢిల్లీలోని ఎర్రకోట‌, రాష్ట్రప‌తి భ‌వ‌న్‌, పార్లమెంట్ భ‌వ‌నాల‌పై జాతీయ జెండాల‌ను సగం వ‌ర‌కు కింద‌కు దించారు. అబే మృతికి నివాళిగా భార‌త్‌లో శ‌నివారం రోజు సంతాపం దినం పాటించ‌నున్నట్లు శుక్రవారం ట్విటర్‌ వేదికగా మోదీ ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. అబే మృతి ప‌ట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ సంతాపం తెలిపారు. జపాన్‌ కోసం అబే తన జీవితాన్నే అంకితం చేశారని కొనియాడారు. 2021లో కేంద్ర ప్రభుత్వం అబెకు భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది.

జపాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే, ఆరోగ్య కారణాలను పేర్కొంటూ 2020లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. భారత్‌లో ముంబై-అహ్మదాబాద్‌ మధ్య తొలి బుల్లెట్‌ రైలు రావటంలో షింజో అబే కీలక పాత్ర పోషించారు. జపాన్‌ సాంకేతికతతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ, అబె కలిసే శంకుస్థాపన చేశారు. ‘మై ఫ్రెండ్, అబే సాన్’ అనే శీర్షికతో ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రధాని మోడీ ఇలా రాశారు. “అబే మరణంతో, జపాన్, ప్రపంచం ఒక గొప్ప దూరదృష్టిని కోల్పోయింది. నేను ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను” అని రాసుకొచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles