Mahankali Temple getting set for Bonalu festival సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఈ నెల 17న బోనాలు, 18న రంగం

Secunderabad ujjaini mahankali temple getting set for bonalu festival on 7th

Golconda bonalu, Bonalu festival celebrations, Telangana tradition, Secunderabad Ujjaini Mahankali temple, Secunderabad Ujjaini Mahankali bonalu, Sri Jagadamba Mahankali temple, Ujjaini Mahankali, Bonalu festival, Goddess Ujjaini Mahankali. Golconda fort, Ashadam bonalu, shravanam bonalu, Hyderabad, Telangana, Devotional

The Ujjaini Mahankali temple in Secunderabad, popular for its biggest Bonalu fete, is gearing up for this year’s celebrations on July 17. As usual, lakhs of devotees are expected to visit the temple on that day. The temple authorities are making the arrangements and constant meetings are held to ensure fool-proof security. The first invitation card for the pooja will be given to Chief Minister K. Chandrashekar Rao.

ఆషాడం బోనాలు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఈ నెల 17న బోనాలు, 18న భవిష్యవాణి

Posted: 07/09/2022 01:52 PM IST
Secunderabad ujjaini mahankali temple getting set for bonalu festival on 7th

తెలంగాణలో బోనాల సందడి ఆషాడమాసం తొలి శుక్రవారం నుంచే మొదలైంది. ఆషాఢమాసంలో తెలంగాణలో బోనాలు ప్రారంభం కావాలంటే ముందుగా చారిత్రక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మవారికి తొలి బోనం సమర్పించాల్సిందే. ఈ ఆచారాన్ని యధావిధిగా అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న జగదాంభిక ఎల్లమ్మతల్లికి తొలి బోనం సమర్పించారు. భాగ్యనగర వైభవం ఉట్టిపడేలా.. తెలంగాణ ప్రత్యేకమైన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్; హోం మంత్రి మహమ్మూద్ అలి ఈ ఉత్సవాలలో పాల్గోన్నారు.

ఇక ఆ తరువాత బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం, బోనాల ఉత్సవాలకు రంగం సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఆపై వచ్చేవారం అనగా ఈ నెల 17న సికింద్రబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో బోనాలు నిర్వహించనున్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 17, 18వ తేదీల్లో అమ్మవారి జాతర నిర్వహించనున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్​ మహంకాళి దేవాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్​ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులతో సమావేశం నిర్వహించారు. వారంలోగా ఆలయంలో చేపట్టిన పనులను పూర్తి చేయనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలియచేశారు.

ఉజ్జయిని మహంకాళి జాతరను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్ననట్లు మంత్రులు తలసాని, మహమ్మద్ అలీ చెప్పారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని ఉజ్జయిని మహంకాళి జాతరను ఘనంగా నిర్వహిస్తామని హోంమంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో హైదరాబాద్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జులై 24న పాతబస్తీ బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles