IMD alerts Heavy to very Heavy Rainfall in Telugu states ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరికలు

Rainfall in telangana imd issues red alert for 14 districts heavy rainfall in other districts

2 dead in wall collapse, heavy rain in telangana, IMD forecast, red alert for 14 districts, Heavry rainfall alert, Indian Meteorological Department (IMD), yellow alert, light to moderate rain, thundershowers, Hyderabad heavy rain, Telangana heavy rain, Hyderabad heavy rain update, Hyderabad rains, Hyderabad weather, hyderabad rainfall, Telangana rains, Hyderabad weather today, IMD hyderabad update, Telangana, Andhra Pradesh, weather news

It has rained continuously in many parts of Telangana over the last two days and more rain is in store for the next two days, according to Indian Meteorological Department centre in Hyderabad (IMD-H). The weather department issued code red alert for 14 districts in Telangana while other districts could receive heavy rainfall. This is the first red alert of the monsoon season.

ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరికలు

Posted: 07/09/2022 12:59 PM IST
Rainfall in telangana imd issues red alert for 14 districts heavy rainfall in other districts

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. గత నాలుగు రోజులుగా ఇటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సహా తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నది. భారీ వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతున్నది. లంక గ్రామాలు నీట మునిగిపోయాయి. లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వీరి కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను సిద్ధం చేశారు. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అటు ఏపీలో గత రెండు రోజులుగా వర్షాలు వణికిస్తున్నాయి.

ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణాంధ్ర జిల్లాల్లో పెద్ద మొత్తంలో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. ఉపరితల ఆవర్తనం, రుతు పవన ద్రోణి ప్రభావంతో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కాగా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశమున్నదని, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు జల్లులు, మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్నది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది.

1.15 లక్షల క్యూసెక్కుల వరదనీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 9.7 అడుగులకు చేరుకున్నది. 17 గేట్ల ద్వారా వరద జలాలను సముద్రంలోకి వదులుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఏకధారగా కురుస్తున్న వర్షాలకు లంక గ్రామాలు వణికిపోతున్నాయి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. జిల్లాలో అధికారులకు సెలవులను రద్దు చేశారు. ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMD  heavy rains  Yellow alert  thunderstorm  rainfall  Hyderabad  light to moderate rain  Telangana  weather news  

Other Articles