India logs 18,840 fresh cases Sets Alarm Bells Ringing మళ్లీ జడలు విప్పుతున్న కరోనా మహమ్మారి..

Covid 19 india logs 18 840 fresh cases 43 deaths in last 24 hours active cases jump to 1 25 028

Covid-19 new variant, coronavirus new variant, covid19 new variant, covid19 Patna new variant, coronavirus Patna new variant, coronavirus Omicron variant, covid19 Omicron new variant, BA.2.75 variant, BA.2.75 covid19 variant, BA.2.75 coronavirus variant, BA.2.75 India, BA.2.75 Maharashtra, BA.2.75 Delhi, Haryana, Telangana, Madhya Pradesh, Karnataka, West Bengal, Uttar Pradesh, Japan, Germany, UK

India recorded 18,840 new cases of the novel coronavirus, along with 43 deaths due to the infection in the past 24 hours. According to the data shared by the Union Health Ministry on Saturday (July 9), the country saw a total of 16,104 discharges in the last 24 hours, taking the total recovery rate at around 98.51 per cent and total recoveries data reached to 4,29,53,980.

మళ్లీ జడలు విప్పుతున్న కరోనా మహమ్మారి.. కొత్తగా 18,840 కేసులు

Posted: 07/09/2022 11:47 AM IST
Covid 19 india logs 18 840 fresh cases 43 deaths in last 24 hours active cases jump to 1 25 028

కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా కొత్త వేరియంట్లుగా పరివర్తన చెంది ప్రపంచదేశాలపై దాడి చేస్తూనే వుంది. యావత్ ప్రపంచ మానవాళిపై తీవ్రప్రభావం చూపుతున్న మహమ్మారి తాజాగా మరో ఉప వేరియంట్ విజృంభనతో అందోళన కలిగిస్తోంది. భారత్ సహా దాదాపుగా పది దేశాలలో నూతన ఉప వేరియంట్ కలకలం రేపుతున్నాయన్న వార్తులు ఒ వైపు దేశ ప్రజలను హడలెత్తిస్తుంటే.. మరోవైపు నాలుగో దశ కరోనా వస్తుందా.? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు నానాటికీ దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య కారణం అవుతోంది.

ఇక ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య గత రెండు వారాల్లో ఏకంగా 30 శాతం పెరిగింది. దేశంలోని ఆ ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభన కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,840 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. శుక్రవారంతో పోలిస్తే 2693 కేసులు పెరిగాయని పేర్కొంది. దాంతో, ఇప్పటిదాకా కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,36,04,394కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల 43 మంది మృతి చెందారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,25,386కి చేరింది. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది.

కేరళలో ఒక్కరోజే 3310 కొత్త కేసులు నమోదవగా.. పశ్చిమ బెంగాల్లో 2950, మహారాష్ట్రలో 2944, తమిళనాడులో 2722, కర్ణాటకలో 1037 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 68.81 శాతం కొత్త కేసులు రాగా.. ఒక్క కేరళలోనే 17.57 శాతం కేసులు రావడం గమనార్హం. ఇక, గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 16,104 మంది కోలుకున్నారు. దాంతో, దేశంలో ఇప్పటిదాకా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,29,53,980కి చేరుకుంది. రికవరీ రేటు 98.51గా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 1,25,028 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక, గత 24 గంటల్లో 12,26,795 కొవిడ్ వ్యాక్సిన్లు అందజేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇటు తెలంగాణలో...

దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. తెలంగాణలో నానాటికీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 606 కేసులు నిర్ధారణ అయ్యాయి. హైదరాబాద్‌‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వైరస్ విజృంభిస్తోంది. ఫలితంగా ఇప్పటివరకు 8,05,137 మంది వైరస్ భారీన పడ్డారు. మరో 459 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 7,95,880 మంది కొవిడ్ నుంచి కొలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,146 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.

కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీచేసింది. నిబంధనలు పాటించని వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles