SpiceJet flight returns to Delhi after crew notices smoke స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం.. 5వేల అడుగుల ఎత్తులో..

Spicejet aircraft makes emergency landing at delhi airport after crew notices smoke in cabin

spicejet, delhi, jabalpur, spicejet flight, delhi emergency landing, jabalpur bound spicejet, delhi to jabalpur bound flight, emergency landing, Delhi to Jabalpur, spicejet smoke, smoke inside spicejet, spicejet plane, spicejet delhi jabalpur flight, smoke inside spicejet cabin, SG-2962, ATC Delhi, Aviation

A Delhi-Jabalpur SpiceJet aircraft (SG-2962) had to return to the Delhi airport on Saturday morning after the cabin crew noticed smoke inside the plane when the aircraft was flying at a height of 5,000ft. A SpiceJet spokesperson said all passengers have deboarded the plane safely at Delhi airport.

ITEMVIDEOS: స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం.. 5వేల అడుగుల ఎత్తులో..

Posted: 07/02/2022 12:31 PM IST
Spicejet aircraft makes emergency landing at delhi airport after crew notices smoke in cabin

దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అత్యంత వేగంగా స్పందించిన పైలట్లు వెనువెంటనే తీసుకున్న చర్యలతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులతో పాటు క్యాబిన్ క్రూ అంతా సురక్షితంగా కిందకు దిగడంతో విమానయాన అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో ఉన్నంత సేపు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కూర్చున్న ప్రయాణికులు కూడా హమ్మాయ్య అని ఊరటపోందారు. అయితే ఈ ప్రమాదం నేలపై ఉన్నప్పుడో లేక రన్ వే పై వెళ్తున్న సమయంలోనో సంభవించింది కాదు.

గగనతలంలో ఏకంగా 5000 అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్‌ నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. స్పైస్‌జెట్‌ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఓ స్పైస్‌జెట్‌ విమానం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది సేపటి తర్వాత విమానం 5వేల అడుగుల ఎత్తులో ఉండగా క్యాబిన్‌లో పొగలు రావడాన్ని క్రూ సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు.

విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని, ప్రయాణికులను క్షేమంగా దించేసినట్లు స్పైస్ జెట్ విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. క్యాబిన్‌లో పొగలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతోన్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఘటనకు గల కారణాలేంటీ? విమానంలో ఎంతమంది ఉన్నారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. గత కొన్ని రోజులుగా స్పైస్‌జెట్‌ విమానాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం. గత నెల 19న దిల్లీకి బయల్దేరిన ఓ విమానం ఇంజిన్‌లో మంటలు రావడంతో దాన్ని అత్యవసరంగా పట్నాలో దించేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles