Telangana SSC 10th Result 2022 Declared తెలంగాణ పదో తరగతి ఫలితాలు: 90శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత

Ts ssc result 2022 telangana class 10th result out at bse telangana gov in

ssc result time, ts 10th result roll bumber, manabadi ts ssc result, www.bse.telangana.gov.in, bse.telangana.gov.in, manabadi ssc results 2022, bse telangana, manabadi, ssc results 2022 telangana, ts ssc results, bse.telangana.gov.in 2022 results, ts ssc results 2022, sabitha indra reddy, education minister, Telangana

BSE Telangana SSC Class 10th Results 2022: The Board of Secondary Education, Telangana (BSE Telangana) declares the class 10 or SSC board results today. The TS SSC results will be announced by the Minister for Education Patlolla Sabitha Indra Reddy. Students who had appeared in the class 10 exams can check their results through the websites, bse.telangana.gov.in or bseresults.telangana.gov.in.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు: 90శాతం ఉత్తీర్ణత.. బాలికలదే హవా..

Posted: 06/30/2022 11:22 AM IST
Ts ssc result 2022 telangana class 10th result out at bse telangana gov in

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ప్రతీసారి తరహాలోనే ఈ సారి కూడా పరీక్షా ఫలితాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో మొత్తంగా 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలలో బాలికలు 92.45 శాతం, బాలురు 87.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక, ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97 శాతంతో మొదటి స్థానంలో, హైదరాబాద్‌ 79 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

15 స్కూల్స్‌లో ఒక్కరూ కూడా పాస్‌ అవలేదని మంత్రి తెలిపారు. 3007 పాఠశాలల్లో 100 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. కాగా, ఆగస్టు 1వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది 5,09,275 మందికి పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 99 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక ప్ర‌యివేటు విద్యార్థుల విష‌యానికి వ‌స్తే 819 మంది హాజ‌రు కాగా, 425 మంది పాస‌య్యారు. 51.89 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో గురుకుల విద్యార్థులు త‌మ స‌త్తాను చాటారు. అటు ప్ర‌భుత్వ‌, ఇటు ప్ర‌యివేటు స్కూళ్ల‌ను దాటేసి విజ‌య‌ఢంకా మోగించారు.

మొన్న విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌లితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటగా, ఇవాళ విడుద‌లైన టెన్త్ ఫ‌లితాల్లో గురుకుల విద్యార్థులు అత్య‌ధికంగా 99.32 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. మరోవైపు ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ఆగ‌స్టు 1 నుంచి నిర్వ‌హించనున్న‌ారు. ఈ ప‌రీక్ష‌లు 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగనున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు జులై 18వ తేదీ లోపు సంబంధిత పాఠ‌శాల‌ల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక, మే 23 నుంచి జూన్‌ ఒకటోవ తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. కరోనా కారణంగా 2022లో పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles