ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగి పడింది. దీంతో ఐదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్ సహా తాడిమర్రి మండలం గుండంపల్లి, పెద్దకోట్ల గ్రామాలకు చెందిన 12 మంది మహిళా కూలీలు పొలం పనుల నిమిత్తం చిల్లకొండయ్యపల్లి గ్రామానికి ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడింది. దీంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళా కూలీలు మృతిచెందగా.. డ్రైవర్‌తో పాటు 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో మొత్తంగా ఆటోలో డ్రైవర్ తో పాటుగా 13 మంది ప్రయాణిస్తున్నారు. మృతులను కుమారి(35), రత్నమ్మ(35), రాములమ్మ(35), లక్ష్మి లక్మీదేవి(32), కాంతమ్మ(32)గా గుర్తించారు. క్షతగాత్రులను ఆర్డీటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుదైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టరును అదేశించిన ఆయన.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈ విషాధఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 12 మంది మహిళలతో వెళ్తున్న జీపుపై విద్యుత్ హైటెన్షన్ లైన్ తీగలు తెగిపడిన ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా విషాదఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. విద్యుత్ తీగ తెగిపడడం మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా అని పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఛార్జీలు పెంచడంపై చూపించే శ్రద్ధ విద్యుత్ లైన్ల నిర్వహణపై చూపాలని సూచించారు. చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు ఒరిగి, తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more