తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులు తమ విధులకుహాజరుకాకుండా.. ఆయా స్థానాల్లో ఎవరో ఒకర్ని తమలా నటింపజేస్తూ.. వారు మాత్రం తమ ఇతర వ్యవహారాలను చక్కబెడుతున్నారన్న అరోపణలు అధికమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఉపాధ్యయులపై ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. ఇకపై విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
అసలేం జరిగిందీ.. ప్రభుత్వం ఇంత అఘమేఘాలమీద ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు అమల్లోకి తీసుకువచ్చిందీ అంటే.. నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్ జావేద్‌అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, వక్ఫ్‌బోర్డు సెటిల్మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ.. నాలుగు చేతులా అర్జిస్తున్నారని 2021లో ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం.. జావేద్ అలీపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది.
శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్స్ చేసింది. జావేద్ అలీపై చర్యలతో పాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉద్యోగులందరికీ సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని గతేడాది ఏప్రిల్‌లో విజిలెన్స్ విభాగం సిఫార్స్ చేసింది. సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు ఉండాలని సూచించింది. సిబ్బంది ఏటా ఆస్తుల వివరాలు సమర్పించడంతో పాటు, స్థిర..చరాస్తి క్రయ విక్రయాలకు ముందస్తు అనుమతి పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫార్సు మేరకు పాఠశాల విద్యాశాఖ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more