విధి అడే వింత నాటకంలో అందరం పావులమే. అయితే.. ఎవరి ఆట ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఇది ముమ్మాటికీ నిజమని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తాం. అయితే నిజమని రుజువు చేసే ఘటనలు జరిగితే.. నిరూపించడం కోసం కాకపోయినా.. కదులుతున్న కారులో వెళ్తున్న ఓ బ్యాంకు మేనేజరు మరణించడం, అమె సోదరి జీనర్మరణాల మధ్య పోరాడుతున్న విషాధ ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. రోడ్డుపై వెళ్తున్న ఆ కారుపై చెట్టు కూలి అర్థాంతరంగా ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఎవరైనా అనుకుంటారా.
కానీ అదే జరిగింది. కారులో వెళ్తున్న వారికి క్షణం క్రితం వరకు అంతా సజావుగానే ఉందని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇంతలో రోడ్డు పక్కనున్న వృక్షమే వారి పాలిట మరణశాసనాన్ని రాసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన వాణి కబిలన్ అనే మహిళ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 24 సాయంత్రం ఆఫీస్ ముగించుకుని తన సోదరి ఎళిలరసితో కలిసి చెన్నైలోని కేకే నగర్ వైపు కారులో వెళుతున్నారు.
అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కారులో వెనుక సీట్లలో కూర్చున్నారు. కార్తీక్ అనే వ్యక్తి కారు నడుపుతున్నాడు. లక్ష్మీ స్వామి రోడ్ నుంచి పీటీ రాజన్ రోడ్ వైపు కారు వెళుతుండగా ఉన్నట్టుండి ఒక పెద్ద చెట్టు కూలి కారుపై పడింది. కారు వెనుక వైపు ఆ చెట్టు అమాంతం పడటంతో ముందు డ్రైవర్ సీట్లో ఉన్న కార్తీక్.. అదిరిపడ్డాడు. డోర్ తీసుకుని బయటపడ్డ డ్రైవర్ భయంతో ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. వాణి, ఎళిలరసిలను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ.. చెట్టు అమాంతం వారు కూర్చున్న భాగంలోనే పడటంతో వాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆమె సోదరిని కారులో నుంచి బయటకు తీసుకొచ్చినప్పటికీ తీవ్రంగా గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసు సిబ్బంది కూడా స్పాట్‌కు చేరుకుని కారుపై పడిన ఆ చెట్టును ప్రొక్లెయిన్ సాయంతో పక్కకు నెట్టేశారు. ఎళిలరసిని కేకేనగర్‌లోని ఈఎస్ఐ హాస్పిటల్‌కు తరలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం వాణి మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే.. సింగారా చెన్నై 2.0 ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న డ్రెయిన్‌కు దగ్గరగా ఉన్నట్టు తెలిసింది.
దీంతో.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అయితే.. జూన్ 22 నుంచి అక్కడ ఎలాంటి తవ్వకపు పనులు జరగలేదని.. ఆ చెట్టు కూలిన ప్రాంతానికి, పనులు జరుగుతున్న ప్రాంతానికి 10 అడుగుల దూరం ఉందని చెన్నై కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి తవ్వకాలు జరగకపోతే అంత పెద్ద చెట్టు మరి ఉన్నట్టుండి ఎందుకు కూలిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ ఊహించని ఘటన కారణంగా ఒక నిండు ప్రాణం పోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more
Aug 13 | తెలంగాణ కాంగ్రెస్ చండూరు సభ వేడి తగ్గడం లేదు. ఎంపీ కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో మొదలైన రగడ... రోజురోజుకూ ముదురుతుంది. ఈ కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న కోమటిరెడ్డి...... Read more
Aug 12 | ఉచిత తాయిలాలు వద్దన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణపై రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి విమర్శలు గుప్పించారు. ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాను పొందుతున్న ఉచితాలేంటో... Read more