Odisha: 3 CRPF personnel killed in Maoist attack మావోయిస్టుల దాడిలో ముగ్గురు పోలీసుల మృతి

Odisha 3 crpf personnel killed in maoist ambush in nuapada district

Odisha Maoist attack, maoist attack, naxal attack, Odisha maoists attack, Nuapada district maoists attack, khordha, janasunani, 19 bn crpf location, nuapada district, crpf news, nuapada odisha, balarampur, odisha, Crime

At least three Central Reserve Police Force (CRPF) personnel were killed in a Maoist attack in Odisha's Nuapada district, on Tuesday. They were part of a road opening party when they came under attack around, the CRPF said. The deceased CRPF personnel have been identified as Assistant Sub-Inspector (ASI) Shishu Pal Singh, ASI Shiv Lal and Constable Dharmendra Kumar Singh.

మావోయిస్టుల దాడిలో ముగ్గురు పోలీసుల మృతి

Posted: 06/21/2022 07:43 PM IST
Odisha 3 crpf personnel killed in maoist ambush in nuapada district

మావోయిస్టులు మరోమారు పేట్రేగిపోయారు. ఒడిశాలో మావోయిస్టులు అదను చూసి భద్రతాబలగాలను దెబ్బకొట్టారు. నౌపాడ జిల్లాలో మావోయిస్టులు పోలీసులపై విరుచుకుప‌డ్డి ముగ్గురి ప్రాణాలను బలిగొన్నారు. బోడెన్ బ్లాక్‌లో సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌పై కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. నౌపడా ప్రాంతంలోని పటధారా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఓ క్యాంపు నుంచి మరో క్యాంపునకు వెళుతున్న సీఆర్పీఎఫ్ బలగాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. మరో ఏడుగురు జవాన్లకు గాయాలయ్యాయి.

క్షతగాత్రులైన పోలీసులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రారంభోత్స‌వం కార్య‌క్ర‌మం భ‌ద్ర‌త‌కు సీఆర్పీఎఫ్ జ‌వాన్లు వెళ్లారు. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన మావోయిస్టులు.. జ‌వాన్లపై కాల్పులు జ‌రిపారు. మావోల కాల్పుల్లో ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ ఏఎస్ఐలు, కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఏఎస్ఐ శిశుపాల్ సింగ్, ఏఎస్ఐ సిబ్లాల్, కానిస్టేబుల్ ధర్మేంద్ర కుమార్ సింగ్ గా గుర్తించారు. ఎదురుకాల్పుల నేప‌థ్యంలో నౌపాడ జిల్లాలో పోలీసులు హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఆ ఏరియాలో భారీగా పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles