HC pulls up State govt on steep parking fee వాహనాల పార్కింగ్‌ బాధ్యత యజమానులదే: హైకోర్టు

Telangana high court pulls up state govt on steep parking fee

Vehicle Parking, High Court, Chief Justice Satish Chandra Sharma, Justice Abhinand Kumar Shavili, HC Notice to State Govt, GHMC officials, ramalinga raju, satyam computer services ltd, PIL, shopping complex, Shopping Malls, Hospitals, Maintainance fees, Parking fees, Telangana, Crime

A two-judge panel, comprising Chief Justice Satish Chandra Sharma and Justice Abhinand Kumar Shavili, of the Telangana High Court issued a notice to the State government and GHMC in a suo moto PIL. The PIL concerns the collection of steep parking fee by certain hospitals, malls and cinema theatres, among other commercial establishments, under the guise of maintenance and security.

వాహనాల పార్కింగ్‌ బాధ్యత యజమానులదే: హైకోర్టు

Posted: 06/21/2022 07:40 PM IST
Telangana high court pulls up state govt on steep parking fee

హైదరాబాద్‌ నగరంలో ఏదేని పనిపై బయటకు వెళ్లిన వాహనదారులు.. పార్కింగ్ సమస్య వేధిస్తోంది. ఈ నేపథ్యంలో పార్కింగ్ సమస్యపై ఇవాళ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నగరంలోని ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ మాల్‌లు, సినిమా థియేటర్లు.. తదితర చోట్ల వినియోగదారులకు పార్కింగ్‌ వసతి కల్పించాల్సిన బాధ్యత వాటి యజమానులదే అని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెయింటనెన్స్‌ పేరు చెప్పి పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడాన్ని తప్పుపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

తమ వాహనాలు పార్కింగ్ చేయకుండా నగరవాసులు ఎలా అసుపత్రులు, షాఫింగ్ మాల్, వాణిజ్య సముదాయాలకు వస్తారని ప్రశ్నించింది. అక్రమంగా పార్కింగ్‌ ఫీజుల వసూలు విషయం న్యాయ మూర్తుల దృష్టికి రావడంతో హైకోర్టు ఈ అంశాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)గా విచారణకు స్వీకరించింది. దీనిపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాహనాల పార్కింగ్ లేకుండా సముదాయాలను నిర్మించడంపై చర్యలు తీసుకోవాలని అదేశించింది. ఇక పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపితే రుసుం వసూలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ మాల్‌లు, సినిమా థియేటర్లు.. లాంటి భవనాలను నిర్మించే సమయంలోనే మున్సిపల్‌ నిబంధనల ప్రకారం పార్కింగ్‌ సదుపాయం ఉందా? లేదా? అని చూసిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అక్రమంగా ఫీజు వసూలు చేయడం గతంలో తాము ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ ప్రణాళిక శాఖ డైరెక్టర్‌తో పాటు రెవెన్యూ, హోం శాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles