Bridge In Mexico Collapses Right After Being Inaugurated నగర మేయర్ ప్రారంభించిన వెంటనే కూలిన వంతెన…

Bridge collapses in opening ceremony sending mayor into river

Mexico, Mayor, New toruist bridge, Inauguration, bridge collapse, council members, city officials, strechers, local hospitals, Viral video

The mayor of a city in Mexico has been left embarrassed after a new bridge during it's inauguration collapsed, sending him and more than 20 people into a ditch. According to reports eight people were injured with broken bones. The local city government said in a statement that four city council members, two other city officials and a local reporter were injured and had to be extracted on stretchers from the gully and were taken to local hospitals.

ITEMVIDEOS: మేయర్ చేతులు మీదుగా వంతెన ప్రారంభం.. ఆ వెంటనే కుప్పకూలింది..

Posted: 06/09/2022 08:06 PM IST
Bridge collapses in opening ceremony sending mayor into river

మెక్సికో సిటీలో ప్రారంభానికి నోచుకున్న వెంటనే ఒక వంతెన కుప్పకూలిపోయింది. అధికారులు, తోటి సహచరులు అందరి ఎదుట ఎంతో అహ్వాదంగా ఫోటోలకు ఫోజులిచ్చిన ఆ నగర మేయర్‌, ఆయన భార్య, నగర పాలక మండలి సభ్యులు, అధికారులు, జర్నలిస్టులు ఒక్కసారిగా హాహాకారాలు పెట్టారు. తమను రక్షించాల్సిందిగా అర్థనాదాలు వినిపించాయి. కొందరు కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేకున్నా మూలుగుతూ తమను రక్షించాలని అరిచారు. ఉన్నట్టుండి వంతెన ప్రారంభించగానే వారు ముందుకు నడువగా.. పది అడుగుల ఎత్తు నుంచి వారంతా కింద పడ్డటంతో ఈ పరిస్థితి తలెత్తింది.

మెక్సికోలోని క్యూర్నావాకా నగరంలో ఈ సంఘటన జరిగింది. రాజధాని మెక్సికో సిటీకి సమీపంలోని అత్యంత జనరద్దీ ఉన్న ఆ నగరంలో సహజ, ప్రకృతి అందాల ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఒక నది వెంట నడక కోసం ఒక వంతెనను ఇటీవల నిర్మించారు. మధ్యలో నీటి ప్రవాహాల మీదుగా వేలాడేటట్లుగా చెక్క, మెటల్‌తో వంతెనను ఏర్పాటు చేశారు. మేయర్ జోస్ లూయిస్ ఉరియోస్టెగుయ్ దీనిని ప్రారంభించారు. అనంతరం తన భార్య, నగర పాలక మండలి సభ్యులు, అధికారులు, మీడియా సిబ్బందితో కలసి ఆ వంతెనపై నుంచి ముందుకు సాగారు. అయితే కాలువ మీదుగా ఉన్న వేలాడే వంతెన భాగం తెగిపోయింది.

దీంతో మేయర్‌, ఆయన భార్యతో సహా 20 మందికిగా వ్యక్తులు పదడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న కొండ రాళ్లు, కాలువ సమీపంలో పడ్డారు. నలుగురు సిటీ కౌన్సిల్‌ సభ్యులు, ఇద్దరు అధికారులు, ఒక స్థానిక రిపోర్టర్‌ సహా పలువురు తీవ్రంగా గాయపడినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కాళ్లు, చేతులు, నడుము విరిగిన ఎనిమిది మందిని స్ట్రెచర్ల సహాయంతో ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, వంతెన ప్రారంభానికి ముందే కొందరు ఆ వేలాడే చోట జంప్‌ చేసి ఉంటారని, అలాగే సామర్థ్యానికి మించి ఒకేసారి ఎక్కువ మంది దానిపై నడవడం వల్ల ఇలా జరిగి ఉంటుందని మేయర్‌ తెలిపారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles