Long Covid may negatively impact performance at work కరోనా సోకినవారిలో తగ్గిన పనిసామర్థ్యం.. తాజా అధ్యయనం

University of waterloo new study covid 19 may negatively impact your performance at work

Long Covid may negatively impact, Long Covid Impact on performance at work, Covid 19, covid impacts at work, Waterloos university, Long Covid, Steriods, memory problem, distract attention, concentration problems, New Study

Individuals who contract COVID-19 often experience memory, attention, and concentration problems, even after recovering from the initial illness. A new study from the University of Waterloo shows individuals who had contracted COVID-19 reported significantly more cognitive failures at work.

కరోనా సోకినవారిలో తగ్గిన పనిసామర్థ్యం.. తాజా అధ్యయనం

Posted: 06/09/2022 07:13 PM IST
University of waterloo new study covid 19 may negatively impact your performance at work

కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాధి మందిని అధికారికంగా బలితీసుకోగా, కోటిమందికి పైగా ఈ కంటిని కనిపించని శత్రువోతో మరణించారని అనదికార లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికీ కరోనా మహమ్మారి బారినపడిన మరణాలు కోనసాగుతున్నాయి. కాగా, కరోనా హృద్రోగుల పాలిక శాపంగా కూడా మారింది. గుండె పనితీరును లోలోపల ప్రభావం చూపుతూనే ఉందని ఇటీవల ఇండియన్ ఫెడరేషన్ ఆప్ కార్డియోలజిస్టులు ఏర్పర్చుకున్న సమావేశంలో ఈ సమాఖ్య కరోనా ప్రభావం-గుండె పనితీరుపై సమీక్ష నిర్వహించిన అందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇక హృద్రోగులతో పాటు దీర్ఘకాలిక రోగాల బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు.. కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడిన రోగులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఇక తాజాగా కరోనా సోకిన ఉద్యోగుల్లో ప‌నితీరు సామ‌ర్థ్యం త‌గ్గిందా? వారు జ్ఞాప‌క శ‌క్తి, ఏకాగ్ర‌త స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారా? అంటే అవున‌నే అంటోంది ఓ నూత‌న అధ్య‌య‌నం. కొవిడ్ సోక‌నివారితో పోలిస్తే కొవిడ్ సోకిన‌వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి స‌మ‌స్య‌లున్నాయ‌ని, వారి ప‌నితీరు మంద‌గించింద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఈ అధ్య‌య‌న ఫ‌లితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.

ఈ అధ్య‌య‌నాన్ని కెన‌డాలోని వాట‌ర్ లూ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు నిర్వ‌హించారు. కొవిడ్ సోకిన‌, సోక‌ని 94 మందిని ప‌రిశోధ‌కులు రెండు బృందాలుగా విభ‌జించి అధ్య‌య‌నం చేశారు. కొవిడ్‌-19 బారిన‌డ‌ప‌డ్డ‌వాళ్ల‌కు శారీర‌క హాని కాకుండా..ప‌నిచేసేసామ‌ర్థ్యంపై హానికర‌మైన ప్ర‌భావాన్ని చూపుతుందని అధ్య‌య‌నంలో తేల్చారు. కొవిడ్ -19 బారిన ప‌డ‌నివారితో పోలిస్తే కొవిడ్ సోకిన‌వారు ప‌నిచేసేట‌ప్పుడు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు త‌మ అధ్య‌య‌నంలో తేలింద‌ని ప‌రిశోధ‌న‌కు నేతృత్వం వ‌హించిన సైకాల‌జీ అసోసియేట్ ప్రొఫెస‌ర్ జేమ్స్ బెక్ పేర్కొన్నారు.

కొవిడ్‌తో బాధ‌ప‌డ్డవారి ప‌నితీరు సామ‌ర్థ్యం చాలామేర త‌గ్గిపోయింద‌ని, కొంద‌రు ఉద్యోగాన్ని స్వ‌చ్ఛందంగా వ‌దిలేయాల‌ని అనుకుంటున్న‌ట్లు ప‌రిశోధ‌న‌లో తేలింద‌ని బెక్ చెప్పారు. కొవిడ్‌తో బాధ‌ప‌డ్డ‌వారు పూర్వ‌స్థితికి రావాలంటే, ప‌నిలో వారికి కొంత వెసుల‌బాటు క‌ల్పించాల‌ని సూచించారు. ప‌నిభారం త‌గ్గించ‌డం, వారి డెడ్‌లైన్స్‌ని పొడిగించ‌డం, సౌక‌ర్య‌వంత‌మైన ప‌ని ఏర్పాట్లు చేయ‌డంలాంటివి వారిలో మ‌ళ్లీ ప‌నిప‌ట్ల‌ ఉత్సాహాన్ని పెంచుతాయ‌ని బెక్ వివ‌రించారు. మొత్తానికి కరోనా కొందరిని ఉన్నపళంగా ప్రాణాలను హరిస్తే.. మరికోందరిపై నెమ్మెదిగా తన ప్రభావాన్ని చాటుతూ స్లో పాయిజన్ లా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క‌ల్పించాల‌ని సూచించారు. ప‌నిభారం త‌గ్గించ‌డం, వారి డెడ్‌లైన్స్‌ని పొడిగించ‌డం, సౌక‌ర్య‌వంత‌మైన ప‌ని ఏర్పాట్లు చేయ‌డంలాంటివి వారిలో మ‌ళ్లీ ప‌నిప‌ట్ల‌ ఉత్సాహాన్ని పెంచుతాయ‌ని బెక్ వివ‌రించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles