Train thieves arrested by Hyderabad police, CCTV footage కరోనా దొంగలు: రైళ్లలో సూట్ కేసులో కొట్టేసి.. ఏం చేశారో తెలుసా.?

Train thieves arrested by hyderabad police cctv footage

Thief Caught Red Handed During Train Journey, Thieves in AC coach, Thives stealing suitcase, Thives in train, ranjan kumar srivatsav, rajeev tastogi, jharkhand, Lucknow, Secundrabad Railway Station, Railway Police, Hyderabad, Telangana, Crime

Secunderabad: Railway police arrested two habitual offenders who are stealing luggage on trains, namley Ranjan Kumar Srivatsav, 63, of Jharkhand and Rajeev Tastogi, 42, of Lucknow, for committing 11 thefts, at railway station on Wednesday. Police officials reocvered, 55 tola gold from their possession. RPF police released the CCTV footage. The thieves migrated to Hyderabad from another state to do some work but witnessed loss due to the Covid-19 lockdown. Therefore they turned as thieves and looted valuables from passengers in AC coaches.

ITEMVIDEOS: కరోనా దొంగలు: రైళ్లలోని ఏసీ కోచులను టక్ష్యంగా చేసుకుని.. ఏం చేశారో తెలుసా.?

Posted: 06/09/2022 09:39 PM IST
Train thieves arrested by hyderabad police cctv footage

ఎవరైనా అనుకోకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక తప్పు చేసి.. తమ జీవితాలు మారుతాయని అశిస్తే.. సర్లే వారు బాగుపడేందు దేవుడి ఇలా అవకాశం ఇచ్చాడని అనుకోవచ్చు. కానీ.. అనుకోకుండా జరిగిన పరిణామాన్నే అలవాటుగా చేసుకుని అదే తప్పును మళ్లి మళ్లీ చేసి.. విలాసాలు, వినోదాలకు పాల్పడితే.. దేవుడు మాత్రం ఎంతకాలం ఉపేక్షిస్తాడు. అదే జరిగింది. కరోనా మహమ్మారి రాకముందు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు హైదరాబాద్ కు వలసవచ్చి.. ఇక్కడ వ్యాపారాలు చేసుకుని కాస్తా.. కూస్తో ఆర్జించిన డబ్బుతో వారి కుటుంబాలను పోషించుకునేవారు. అయితే కరోనా మహమ్మారి వారి తలరాతలను మార్చింది.

కరోనా దెబ్బకు లాక్ డౌన్ లు విధించడంతో.. వ్యాపారానికని దాచుకున్న డబ్బులు అన్ని ఖర్చుకావడంతో. ఏం చేయాలో తెలియక ఓ సారి ఏసీ క్లాస్ కోచులలో హైదరాబాద్ కు వచ్చారు. దిగిన వెంటనే తమ లగేజీ చేసుకున్నారు. తమతో పాటు ఇతర ప్యాసింజర్ లగేజీ కూడా వచ్చింది. సర్లే తెరచి చూద్దాం.. వారి చిరునామా ఉండే తిరిగి పంపిద్దామనుకుని తమ రూమ్ కు వెళ్లారు. వెళ్లగానే సూట్ కేసు తెరిచి చూశారు. అందులో ఇతర ప్యాసింజర్లకు చెందిన బట్టలతో పాటు బంగారు ఆభరణాలు ఉన్నాయి. బంగరాన్ని చూడగానే వారి మనసు మారింది. దానిని సోమ్ముచేసుకుని స్టార్ హోటళ్లకు వెళ్లి జల్సా చేశారు.

ఇలా ఒక్కసారి తరువాత మరోకటి.. ఇలా ప్యాసింజర్ల సూట్ కేసులు కొట్టేస్తూ.. వాటి నుంచి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తూనే.. బంగారాన్ని మాత్రం దాచిపెట్టారు. తీరా ఇక దొంగతనాలకు స్వస్తి పలికాలని భావించి బంగారాన్ని పంచుకున్నారు. అక్కడ ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. ఇంకేముంది.. మరోమారు దొంగతనం చేసి లెక్కను సరిచేద్దామని అనుకున్నారు. ఈ క్రమంలో ఓ రైలులో ఏసీ కోచ్ లో టికెట్ రిజర్వు చేసుకుని యధాతధంగా సూట్ కేసు తీసుకుని దిగుతుండగా, రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కారు. ఇక వీరి నుంచి ఏకంగా 55 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంతకీ వీరులో ఒకరు జార్ఖండ్ కు చెందిన రాజీవ్ తక్సోంగీ (65) మరోకరు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రంజన్ కుమార్ శ్రీవాత్సవ్ (42).


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles