Cabinet approves hike in MSP for kharif crops రైతులకు కేంద్రం శుభవార్త.. కనీస మద్దతు ధర పెంపు

Government hikes minimum support price for 17 kharif crops including paddy

kharif crop, MSP kharif crops, Cabinet MSP kharif crops, MSP for crops, kharif crops, paddy support price, Indian agriculture, Central Government, Cabinet Committee on Economic Affairs, cabinet, msp, kharif crops

The government hiked the minimum support price (MSP) for paddy by Rs 100 to Rs 2,040 per quintal for 2022-23 crop year in order to encourage farmers to bring more area under the crop and boost their income. The Cabinet Committee on Economic Affairs (CCEA), chaired by Prime Minister Narendra Modi, approved the increase in MSPs for all 14 kharif (summer) crops for 2022-23 crop year.

రైతులకు శుభవార్త అందించిన కేంద్రం.. కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం..

Posted: 06/08/2022 07:47 PM IST
Government hikes minimum support price for 17 kharif crops including paddy

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన రైతుల పోరాటంతో వారిపై కేంద్రం గుర్రుగా ఉందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈ గుడ్ న్యూస్ తో స్పష్టం చేసింది. దేశ ప్రగతి వ్యవసాయ ఉత్పత్తులతో ముడిపడివుందని బావించిన కేంద్రం.. దేశరైతాంగ అభ్యున్నతి కోసం ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకుంటామని ఈ నిర్ణయంతో తేల్చిచెప్పింది. ఇంతకీ రైతులకు కేంద్రం చెప్పిన శుభవార్త ఏంటీ అంటారా. 2022-23 సంవత్సరానికి గానూ 17 ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కమిటీ దీనికి ఆమోదం తెలిపిందని ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ తీసుకున్న పలు చర్యలు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సాయపడతాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. 17 పంటలకు తాజా ధరలు క్వింటాల్‌కు రూ.92 నుంచి రూ.523 వరకు పెరిగాయి. వరి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కనీస మద్దతు ధరను రూ.100 పెంచింది. దీంతో క్వింటాల్ ధాన్యం రూ.2,040కు పెరిగింది. ఎ-గ్రేడ్ ధాన్యానికి రూ.2,060కు పెంచింది. వీటిలో గరిష్టంగా నువ్వులు క్వింటాల్‌కు రూ.523 పెంచారు.

సోయాబీన్, కందులపై రూ.300 చొప్పున, పెసర్లపై రూ.480 పెంచారు. మొక్కజొన్నపై క్వింటాల్‌కు అత్యల్పంగా రూ.92 పెంచారు. వాణిజ్య పంటలైన పత్తి కనీస మద్దతు ధర రూ.6,380కు పెరిగింది. గతేడాది ఇది రూ.6,025గా ఉంది. పెసర్లు రూ.7,275 నుంచి రూ.7,755కు పెరిగింది. మినుములు రూ.6,300 నుంచి రూ.6,600 పెరగ్గా, సోయాబీన్ రూ.3,950 నుంచి రూ.4,300కు, సన్ ఫ్లవర్ రూ.6,015 నుంచి రూ.6,400కు పెరిగాయి. వేరుశనగ రూ.5,550 నుంచి రూ.5,850కి, నువ్వులు అత్యధికంగా రూ.7,307 నుంచి 7,830కి, రాగి ధర రూ.3,377 నుంచి రూ.3,578కి, జొన్నలు రూ.2,250 నుంచి రూ.2,350 పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MSP for crops  kharif crops  paddy support price  Indian agriculture  Central Government  

Other Articles