No LPG subsidy to households ఎల్పీజీ సిలిండ‌ర్‌పై సబ్సీడీ ఎత్తివేసిన కేంద్రం..

No lpg subsidy to households rs 200 lpg dole limited to ujjwala beneficiaries

Ujjwala scheme, LPG, LPG subsidy, Cooking gas subsidy, Pradhan Mantri Ujjwala scheme, Pradhan Mantri Ujjwala Yojana, LPG Cylinder price, LPG cylinder subsidy, LPG subsidy,Ujjwala beneficiaries,households LPG subsidy,LPG price,LPG cylinder prices,LPG connectio,Ujjwala beneficiaries LPG connections,Ujjwala beneficiaries LPG subsidy benefit,Pankaj Jain,Nirmala Sitharaman,Pradhan Mantri Ujjwala Yojana,14.2 kg LPG cylinder,19 kg lpg cylinder price,Hardeep Singh Puri

The government has limited subsidy on cooking gas LPG for only 9 crore poor women and other beneficiaries who got free connections under the Ujjwala scheme and the remaining users including households will pay the market price. Oil Secretary Pankaj Jain said no subsidy is paid on cooking gas since June 2020 and the only subsidy that is provided is the one that Finance Minister Nirmala Sitharaman announced on March 21.

సామాన్యుడి నెత్తిన గుదిబండ.. ఎల్పీజీ సిలిండ‌ర్‌పై సబ్సీడీ ఎత్తివేసిన కేంద్రం..

Posted: 06/03/2022 12:33 PM IST
No lpg subsidy to households rs 200 lpg dole limited to ujjwala beneficiaries

దేశప్రజలపై ప్రత్యక్ష పన్నులను వేస్తూ.. భారీగా ఆదాయం ఆర్జిస్తున్న కేంద్రప్రభుత్వం.. మరోవైపు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ .19.8 నుంచి రూ .32.9 కు, డీజిల్‌పై రూ.15.83 నుంచి రూ. 31.8 మేరక రికార్డు స్థాయికి పెంచిన విషయం తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా ప్రజాగ్రహాన్ని చవిచేసిన నేపథ్యంలో ఇటీవల ఎనమిది రూపాయల మేర తగ్గించింది. ఈ క్రమంలో ఏకంగా ఎక్సైజ్ పన్ను ద్వారా 2019-2020లో ఏకంగా 3.35 లక్షల కోట్ల రూపాయలను ఆర్జించిన కేంద్రప్రభుత్వం సామాన్యులకు ఎల్సీజీ గ్యాస్ సిలిండర్ పై దక్కే కనీస సబ్సీడీని కూడా కూకటివేళ్లతో పెకిలించి వేసింది.

జీఎస్టీ ఆదాయం ఏప్రిల్ నెలలో రూ. 1.68 లక్షల కోట్లతో రికార్డు స్థాయి గరిష్టస్థాయికి చేరిన తరుణంలో దేశప్రజలకు కేంద్రం ఏదేని విషయంలో ఊరట కల్పిస్తుందని ఆశించగా.. కేంద్రం మాత్రం ఎప్పటి నుంచో యూపీఏ ప్రభుత్వం నుంచి వస్తున్న సబ్సీడిని పూర్తిగా ఎత్తివేసింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండ‌ర్‌పై రాయితీని ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పీఎం ఉజ్వ‌ల్ యోజ‌న పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ పొందిన వినియోగ‌దారుల‌కే రాయితీని పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. మిగతావారందరూ ఇకపై మార్కట్‌ ధరకే సిలిండర్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆయిల్‌ సెక్రటరీ పంకజ్‌ జైన్‌ మీడియాకు వెల్లడించారు.

కరోనా ప్రారంభమైనప్పటి నుంచి గ్యాస్‌ వినియోగదారులకు సబ్సీడీ ఇవ్వడం లేదని చెప్పారు. ఇకపై ఉజ్వల పథకం కింద గ్యాస్‌ సిలిండర్ తీసుకున్న వాళ్లకే సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్పీజీ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 9 కోట్ల మంది ఉజ్వల పథకం లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పడు ఈ పథకం కింద ఉన్నవారికి ఏడాదిలో 12 సిలిండర్లకు రూ.200 చొప్పున సబ్సిడీ లభించనుంది. 2010లో పెట్రోల్‌పై సబ్సిడీ ఎత్తివేయగా.. 2014 నవంబర్‌లో డీజిల్‌పైన కేంద్రం సబ్సిడీని తొలగించింది. 2016లో కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీని నిలిపివేసిన ప్రభుత్వం.. తాజాగా గ్యాస్‌పై సబ్సిడీని ఎత్తివేస్తూ సామాన్యుడి నడ్డి విరిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles