Pawan Kalyan extends financial assistance to JSP Activist తెలంగాణలో మన సత్తా చాటుదాం.. పోటీ చేద్దాం: పవన్ కల్యాణ్

Pawan kalyan extends financial assistance of rs 5 lakh to kin of kongari saidu

Pawan kalyan, Jana sena President, Jana Sena, Goparajupally village, Nalgonda, financial assistance, Rs 5 lakh, Kongari Saidu, road accident, Sumathi, Saidu's son, health condition, education, health, Telangana, Politics

Janasena Party President Pawan Kalyan extended financial assistance of Rs 5 lakh to the family members of Kongari Saidu, an active member of the party who died in a road accident recently. The actor-turned politician called on the family members of Saidu at Goparajupally village in this district and consoled the deceased wife Sumathi. The Jana Sena President assured that the party would take responsibility for the education and health of the children.

తెలంగాణలో మన సత్తా చాటుదాం.. పోటీ చేద్దాం: పవన్ కల్యాణ్

Posted: 05/20/2022 05:43 PM IST
Pawan kalyan extends financial assistance of rs 5 lakh to kin of kongari saidu

రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా ప్రకటన చేశారు. పవన్ కల్యాణ్ ను చూడగానే ఉత్సాహంతో కేరింతలు, ఈలలు, అరుపులు వేస్తుండగా పవన్ చేసిన ప్రకటన వారికి జీవవాయువును అందించినట్లైంది. తెలంగాణలోనూ జనసేన పార్టీ బలంగా ఉందని, వచ్చే ఎన్నిక్లలో సత్తా చాటుతామని అన్నారు. తమ పార్టీ తెలంగాణ రాజకీయాలల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో తమకు ఓటు బ్యాంకు ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ అధికారాన్ని ఆశించలేదని.. సామాజిక మార్పు తన లక్ష్యం అని అన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పిన పవన్.. ఓటమికి కుంగిపోను అని వ్యాఖ్యానించారు. అలాగే గెలుపుతో వచ్చే అధికారం కూడా తమకు అంధకారం రాదని చెప్పారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉందని, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జనసేన జెండా ఎగరాలని.. అందుకు కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

పవన్ కల్యాణ్ వాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్, జగన్ మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందన్నన ప్రచారం ఉన్న నేపథ్యంలో జనసేన ప్రయత్నం ఏ మేరకు ఉండబోతోందనేది చర్చగా మారింది. రాబోయే ఎన్నికల్లో జనసేన ఎవరితోనైనా పొత్తు పెట్టుకోనుందా అనే చర్చ సాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శుక్రవారం పర్యటించిన ఆయన ఇటీవల చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రమాద వశాత్తు చనిపోయిన ఇద్దరు జనసైనికుల కుటుంబాలను పరామర్శించి, భీమా చెక్కులను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండకు బయలుదేరినకు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వద్దనున్న అక్కపురి చౌరస్తా వద్ద జనసైనికులు, పవన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని అన్నారు. రాజకీయాల్లోనూ యువత కీలక భూమిక పోషించాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles