Noida: 81-Year-Old Held For 'Digital Rape' 81 ఏళ్ల వృద్దుడిపై డిజిటల్ రేప్ కేసు.. ఏడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

Noida man held for digital rape of minor for 7 years what is digital rape

Digital Rape, digital rape news, what is digital rape, Noida Latest News, 81 year old held digital rape, artist held for digital rape, digital rape in noida, noida digital rape news, digital rape, nirbhaya case, minor girl, indian penal code, sexual assault, noida, allahabad, Uttar pradesh, crime

An 81-year-old sketch artist has been arrested in Uttar Pradesh's Noida for the alleged 'digital rape’ of a 17 year-old girl over a period of more than seven years. But what is digital rape? While the term evokes ideas of the newly developing metaverse, it actually refers to the physical act of using fingers of a hand or foot, i.e. ‘digits’, for sexual assault of a woman.

81 ఏళ్ల వృద్దుడిపై డిజిటల్ రేప్ కేసు.. ఏడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

Posted: 05/17/2022 06:49 PM IST
Noida man held for digital rape of minor for 7 years what is digital rape

కృష్ణా, రామా అని భగవంతుడి నామ జపం చేయాల్సిన వయస్సులోనూ ఓ వృద్దుడు తన మనవరాలి వయస్సులోని మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి దారుణ ఘటనలు అనేకం జరుగుతున్నా.. ఈ కేసు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ పోలీసులు 81 ఏళ్ల వృద్ధుడిపై ‘డిజిటల్ రేప్’ కేసు నమోదు చేశారు. యూపీలో ఇలాంటి కేసు నమోదు కావడం ఇది రెండోసారి. డిజిటల్ కేసు అంటే ఏంటీ.. మైనర్ బాలికను లైంగికంగా వేదిస్థూ డిజిటల్ గా వీడియోలు తీస్తున్నాడా.? అనేగా మీ సందేహం. అందుకనే పోలీసులు అతనిపై డిజిటల్ రేప్ కేసు నమోదు చేశారనేగా మీ డౌట్.

డిజిటల్ రేప్ అనేవి రెండు వేర్వురు పదాలు.. డిజిట్, రేప్. కానీ రెండింటినీ కలిపి డిజిటల్ రేప్ అని పేరు పెట్టారు. డిజిట్​ అంటే ఆంగ్లంలో అంకె అని అర్థం. ఆంగ్ల నిఘంటువులో శరీర భాగాలకు కూడా నంబర్లు ఉంటాయి. దీంతో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో ఆ సంఖ్యల ఆధారంగా కేసు నమోదు చేస్తారు. డిజిటల్​ రేప్​ అంటే.. బాధితురాలి జననాంగంలోకి నిందితుడు చేతి వేళ్లు, కాలి వేళ్లు లేక వస్తువులను చొప్పించడం లాంటి లైంగిక వైధింపులకు పాల్పడటం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వివరాలు తెలుసుకుని ఈ కేసును నమోదు చేస్తారు.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. అలహాబాద్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధుడు మౌరిస్ రౌడర్ నోయిడాలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. నోయిడాలో తన స్నేహితురాలితో కలిసి ఉంటున్న ఆయన తన పనులకు బదులు.. తన స్నేహితురాలి ఇంట్లో పనిచేసేందుకు పెట్టుకున్న 17 ఏళ్ల మైనర్ బాలికను టార్గెట్ చేశాడు. తన మనవరాలి వయస్సున్న చిన్నారిపై ఏడేళ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. చిన్నవయస్సులో అమెకు అవి లైంగిక వేదింపులని తలియకపోవడంతో మిన్నకుండిపోయింది. కానీ పెద్దవుతున్న కోద్దీ వేధింపులు కూడా పెరిగాయి.

దీంతో అతడి వేధింపులు భరించలేని బాధిత బాలిక తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను పనిలో చేరినప్పటి నుంచి మౌరిస్ లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత బాలిక పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను, వీడియో, ఆడియో రికార్డులను సాక్ష్యాలుగా అందజేసింది. నిందితుడిపై ‘డిజిటల్ రేప్’ అభియోగాలు నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి తోడు మైనర్ బాలికను పనిలో ఎలా పెట్టుకున్నారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అతడితోపాటు నిందితుడి స్నేహితురాలిపై కూడా కేసు నమోదు చేసే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : digital rape  nirbhaya case  minor girl  indian penal code  sexual assault  noida  allahabad  Uttar pradesh  crime  

Other Articles