ఏమి జరిగినా మన మంచికే అన్న సూక్తిని పాటిస్తూ.. ధైర్యంగా ముందుకు నడిస్తే.. అపజయాలే విజయశిఖారాలుగా మారుతాయన్నది పెద్దల మాట. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మీ అనే మాట కూడా పుట్టింది. ఈ సూక్తి ఈ యువతి విషయంలో అక్షరాలా నిజమైంది. అప్పటి వరకు చేస్తున్న ఉద్యోగం ఆకస్మికంగా ఊడితే కొందరు డిప్రెషన్లోకి వెళ్లతారు.. లేక మరికొందరిలా మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడలేదు..ఇంకొందరు తమకు సంబంధించిన మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ రోజులు గడిపేయలేదు. కానీ తనకు కావాల్సిన డబ్బును ఎలా సంపాదించాలా.? అన్న వినూత్నంగా ఆలోచన చేసింది.
అమెలో పుష్కలంగా ఉన్న ఆత్మవిశ్వాసం అనుభవం లేని పనిలోనూ రాణించేలా చేస్తోంది. కోల్‌కతాకు చెందిన 30 ఏళ్ల మౌతుషి బసు తాను పనిచేస్తున్న పానసోనిక్ కంపెనీలోని ఉద్యోగం కరోనా లాక్ డౌన్ కారణంగా కొల్పోయింది. కరోనా కారణంగా దేశంలోని లక్షలాది మందిలానే ఆమె కూడా ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డారు. సినీపరిశ్రమకు చెందిన దర్శకుడు, నటులే టీస్టాళ్లు, హోటళ్లు పెట్టుకుని బతుకుబండిని నడిపారు. అలానే బసు కూడా ఉద్యోగం కోల్పోయింది. ఉద్యోగం పోయినందుకు అమె ఏ మాత్రం బాధపడలేదు. ఈ పరిస్థితుల్లో తాను కుటుంబాన్ని ఎలా పోషించాలన్న అలోచన చేసింది.
అందుకోసం అమె తనకు ఏమాత్రం పరిచయం లేని రంగాన్ని ఎంచుకుంది. తన కుటుంబానికి అన్నం పెట్టగలిగే.. చట్టబద్దమైన పనిలో చేరితే చాలు అనుకుంది. అంతే ఉబెర్ సంస్థలో డ్రైవర్ గా మారింది. తొలుత కొంత కష్టంగా సాగినా.. ఇప్పుడు మాత్రం చాలా బిజీ అయిపోయింది. రచయిత రణవీర్ భట్టాచార్య లింక్డిన్లో ఆమె కథను షేర్ చేయడంతో వైరల్ అయింది. ఆమె ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. కోల్‌కతాలో తాను బయటకు వెళ్లేందుకు ఉబెర్ బైక్‌ను బుక్ చేస్తే మౌతుషి బసు వచ్చారని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆమెను ప్రశ్నిస్తే.. తను చెప్పిన విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
తాను పానసోనిక్‌లో ఉద్యోగం చేసేదానినని, కరోనా కారణంగా ఉద్యోగం పోయిన తర్వాత కుటుంబ పోషణ కోసం ఇలా రైడర్‌గా మారినట్టు చెప్పారని రణవీర్ తెలిపారు. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నా ఆమె బండిని చాలా జాగ్రత్తగా నడిపారని, అందుకు అదనంగా డబ్బులు ఏమీ అడగలేదని పేర్కొన్నారు. ఇలా రైడర్ గా మారాలని ఎందుకు అనిపించిందని అడిగితే, కుటుంబాన్ని పోషించుకోవడానికి మరో మార్గం కనిపించలేదని, అందుకే తెలిసున్న విద్యనే ఎంచుకున్నానని ఆమె చెప్పారని వివరించారు. బసు కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 27 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 46 పోస్టుల భర్తీ... Read more
Jun 27 | అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడమీని... Read more
Jun 27 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్‌కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్, పత్రా చావల్... Read more
Jun 27 | ఆర్మీలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అగ్నిఫథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, అందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి... Read more
Jun 27 | శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి..... Read more