Man held for assaulting woman lawyer in public మహిళా న్యాయవాదిపై దాడి చేసిన ఫ్రొఫెసర్ అరెస్ట్..

Karnataka professor arrested for assaulting woman lawyer in public

Karnataka, Bagalkote, Police, Man arrested for assaulted female layer, woman Advocate, female lawyer, Sangeeta Shikkeri, neighbour, Mahantesh, property dispute, Professor arrested, Bagalkot BJP General Secretary Raju Naikar, Bagalkote, Karnataka, Crime, advocate assault viral video, Karnataka High Court, viral video

A man from Bagalkote district in Karnataka was arrested by the police after visuals of him assaulting a female lawyer went viral on social media. The man, Mahantesh, assaulted a lady lawyer and her husband over a land dispute in broad daylight. A video of the assault has gone viral on Twitter with over 500,000 views. Bagalkote town police have arrested Mahantesh and charged him with assault. The woman and Mahantesh are reportedly neighbours.

ITEMVIDEOS: నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిపై దాడి చేసిన ఫ్రొఫెసర్ అరెస్ట్..

Posted: 05/16/2022 05:57 PM IST
Karnataka professor arrested for assaulting woman lawyer in public

ఆయనో ప్రోఫెసర్.. ఎదిగిన విద్యార్థులకు ఉన్నతమైన వ్యక్తులుగా.. ప్రోఫెషనల్ కోర్సులను బోధించే గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే ఆయన చేసిన పనే ఇప్పుడాయనను వార్తల్లో నిలిపింది. తాను ప్రోఫెసర్ అన్న విషయాన్ని మర్చిన ఆయన.. పశువులా ప్ర‌వ‌ర్తించాడు. మరోలా చెప్పాలంటే అంతకన్నా దిగజారీ మరీ ప్రవర్తించాడు. తన పోరుగింటిలో నివసించే మహిళా న్యాయవాదిని అంద‌రూ చూస్తుండ‌గానే న‌డిరోడ్డుపై దాడి చేశారు. ఎంతలా అంటే.. మరటోడు కూడా పశువులను అలా కోట్టడు.

మహిళలపై చేయిచేసుకోవడమే తప్పుంటే ఈ చదవుకున్న మూర్ఖుడు మాత్రం అమెను కోట్టడమే కాదు ఏకంగా అమె కడుపులో బలంగా కాలితో త‌న్నాడు. ఒంటిరి అబలను టార్గెట్ చేసి.. దారుణంగా కొట్టాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బాగ‌ల్‌కోట్ జిల్లాలోని వినాయ‌క్ న‌గ‌ర్‌లో చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. కాగా వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు ప్రోఫెసర్ ను అరెస్టు చేశారు. అయితే మహిళా న్యాయవాదిని టార్గెట్ చేసి కోట్టడానికి బాగ‌ల్‌కోట్ బీజేపి పార్టీ ప్రధాన కార్యదర్శి రాజు నాయికర్ కారణమని తెలుస్తోంది.

బాగ‌ల్‌కోట్‌కు చెందిన మ‌హంతేష్ అనే వ్య‌క్తి స్థానికంగా ఉన్న యూనివ‌ర్సిటీలో ఫోటోగ్రాఫ‌ర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మ‌హంతేష్ ఇంటి ప‌క్క‌నే సంగీత అనే లాయ‌ర్ కూడా నివ‌సిస్తోంది. అయితే బాగ‌ల్‌కోట్ బీజేపి ప్రదాన కార్యదర్శి రాజు నాయికర్ తో ప్రోపెసర్ మహంతేష్ కు స్నేహం ఉంది. దీంతో ఆయనకు సంబంధించిన ఓ ఆస్తి వ్యవహారంలో లాయర్ సంగీత ప్రత్యర్థిగా వుంది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య గ‌త కొంత‌కాలం నుంచి వివాదాలు కొన‌సాగుతున్నాయి. అయితే ఈ ఆస్తి వివాదంలో తనను ఇంబ్బందులు పెడుతోందని మహంతేష్ వద్ద వాపోయాడు రాజు నాయికర్. ఇక ఆ సమస్య తనది అన్నట్లుగా బావించిన ఆయన అమెను పిలిచి నడిరోడ్డు మీదే దాడి చేశాడు.

న‌డిరోడ్డుపై సంగీతపై దాడి చేశాడు. ఆమె చెంప‌ల‌పై కొడుతూ.. క‌డుపు భాగంగా బ‌లంగా త‌న్నాడు. అత‌న్ని త‌ప్పించుకునేందుకు అక్క‌డున్న కుర్చీని అడ్డు పెట్టుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. సంగీత‌పై బ‌లంగా త‌న్నాడు మ‌హంతేష్‌. ఈ కేసులో మ‌హంతేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఎవరి కోసం న్యాయవాది సంగీత పై దాడి చేయలేదని మహంతేష్ తెలిపాడు. కాగా రాజు నాయికర్ కూడా అదే విషయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇరుగుపోరుగున ఉండే వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని సమాచారం. మరి అంతగా దాడి చేయడానికి కారణమేంటో పోలీసులైనా తేల్చేనా.?.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles