సింగిల్ బిర్యానీ ఖరీదు ఎంత.. అంటే ఠక్కున వచ్చే సమాధానం రూ.150. సరే కొంత బెస్ట్ పాపులర్ హోటల్ బిర్యాని అయినా మహాఅంటే రూ.300. అలా కాదు స్టార్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీ ఖరీదు ఎంత ఉంటుంది అని అడిగితే.. ఎంత ఎక్కువ వేసినా.. రూ.1000లోపు మాత్రమే ఉంటుంది. కానీ ఓ అధికారి కోసం తీసుకువచ్చిన బిర్యాని ఖరీదు వింటే మెతుకు కూడా మింగలేరు. ఏంటీ వెయ్యి రూపాయలను మించి ఉంటుందా ఏంటీ అంటారా.. ఎక్కడ వేలు.. ఏకంగా లక్షల రూపాయల ఖరీదు చేస్తే.. ఔనా.. బిర్యాని ఖరీదు లక్ష.. అంటే కాదు ఏకంగా మూడు లక్షలు అని చెప్పాల్సివస్తుంది.
ఏమీటీ చిత్రం.. ఓ అధికారి భుజించిన బిర్యానీ ఖరీదు ఏకంగా రూ. 3 లక్షలా.? అంటూ నోరెళ్లబెట్టకండీ.. ఈ బిర్యాని మ్యాటర్ లోకి ఎంటరయ్యేముందు.. ఆ బిల్లును ఓ ప్రభుత్వ ఆస్పత్రికి సమర్పించి అమోదముద్ర వసుకునే క్రమంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి యాజమాన్యం.. అంతుకుముందు ఇచ్చిన బిల్లులతో పాటు ఆ తరువాత సిద్దంగా వున్న ఇతర బిల్లుల బూజును కూడా దులిపింది. దీంతో అసుపత్రికి మెటీరియల్ సప్లయర్ కాంట్రాక్టు పోందిన వ్యక్తి అవినీతి బాగోతం బయటపడింది. దీంతో అసుపత్రి అధికారులు అతడిపై పోలీసులకు పిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ ఈస్ట్ బర్ధామన్ జిల్లాలోని కత్వా సబ్ డివిజన్ ఆస్పత్రికి కింగ్ షూక్ గోష్ అనే కాంట్రాక్టర్ ఫర్నీచర్, వాహనాలతో పాటు అధికారుల కోరిక మేరకు అప్పుడప్పుడు బిర్యానీని సరఫరా చేస్తుంటాడు. ఇలా మూడు పువ్వులు ఆరు కాయలుగా చక్కగా సాగుతున్న అతని వ్యవహారంలోకి ఓ బ్రేక్ వచ్చింది. అప్పటివరకు ఉన్న అసుపత్రి సూపరింటెండెంట్ అక్కడి నుంచి బదిలీ అయ్యారు. దీంతో ఆ ఆస్పత్రికి సౌవిక్ ఆలం అనే కొత్త సూపరింటెండెంట్ నియామకం అయ్యారు. ఆయన ముందు కాంట్రాక్టర్ రూ. కోటి విలువ చేసే బిల్లులను ఉంచాడు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని సూపరింటెండెంట్ అధికారులను ఆదేశించాడు.
అయితే సౌవిక్ ఆలం కాంట్రాక్టర్ సమర్పించిన బిల్లుల్లో 81 బిల్లులను బోగస్‌గా గుర్తించాడు. అందులోని ఓ బిర్యానీ బిల్లు రూ. 3 లక్షలుగా ఉంది. దీంతో సూపరింటెండెంట్ షాక్ అయ్యారు. క్షణం ఆలోచించకుండా పేషెంట్ వెల్ఫేర్ కమిటీతో సౌవిక్ ఆలం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బోగస్ బిల్లులను డిపాజిట్ చేసిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా నకిలీ బిల్లుల విషయాన్ని ధ్రువీకరించింది. ఆ బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్కరిని విచారిస్తామని, దోషులగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more