Three killed in landslides in Assam అసోంలో వర్షబీభత్సం.. స్థంభించిన జనజీవనం.. అపార అస్తినష్టం..

Assam flood 2022 around 57 000 people affected 3 killed landslides in several areas

assam flood 2022, assam flood news, assam famous flood, assam landslides, assam flood information, asdma, assam flood, assam flood 2022, assam rain, assam rainfall 2022, assam landslide, assam weather, weather updates

Incessant rains have triggered floods and landslides in Assam. Around 57,000 people have been affected by the current spell of flood, while three have been killed in the northeastern state. All three deaths have been reported from Cachar district. Cachar, Dhemaji, Hojai, Karbi Anglong West, Kamrup (M), Nagaon and Nalbari have been affected by floods.

అసోంలో వర్షబీభత్సం.. స్థంభించిన జనజీవనం.. అపార అస్తినష్టం..

Posted: 05/16/2022 03:33 PM IST
Assam flood 2022 around 57 000 people affected 3 killed landslides in several areas

ఈశాన్య రాష్ట్రం అసోంలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. వర్షంతో పాటు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజాజీవనం స్థంభించింది. వర్షం, వరదల కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, అపార ఆస్తినష్టం వాటి్ల్లినట్లు రాష్ట్రాధికారులు తెలిపారు. అయితే వర్షం తగ్గిన తరువాతే నష్టాన్ని అంచనా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ నెల 18 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తామని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు వరదలు సంభవించే హెచ్చరికలను అధికారులు విడుదల చేశారు. కాగా, రాష్ట్రంలో సంభవించిన మూడు మరణాలు దిమా హసో జిల్లాలోనే సంభవించాయి.

వరదల కారణంగా 15 రెవెన్యూ సర్కిళ్లలోని దాదాపు 222 గ్రామాలు నీటమునిగాయి. 10321.44 హెక్టార్ల పంట నీట మునిగింది. దిమా హసో జిల్లాలో ఓ చిన్నారి, ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. అలాగే, 1,434 జంతువులు కూడా వరద బారినపడ్డాయి. 202 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మొత్తంగా 57 వేల మందిపై వరదల ప్రభావం పడింది. రంగంలోకి దిగిన ఆర్మీ, పారా మిలటరీ దళాలు, ఎస్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. పలు జిల్లాల్లోని రోడ్లు, బ్రిడ్జిలు, కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వానలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి.

మరీ ముఖ్యంగా న్యూ కుంజంగ్, ఫియాంగ్‌పుయ్, మౌల్‌హోయ్, నమ్‌జురాంగ్, సౌత్ బగేటార్, మహాదేవ్ తిల్లా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్ మరియు లోడి పాంగ్‌మౌల్ గ్రామాలలో కొండచరియలు విరిగిపడ్డాయని అసోం రాష్ట్ర విపత్తు నివారణ అధికారులు తెలిపారు. వీటి కారణంగా దాదాపు 80 ఇళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. దీంతో రైల్వే ట్రాకులు, వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్డు రవాణా స్తంభించిపోయింది. వరదల నేపథ్యంలో ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. జటింగా-హరంగాజావో, మహూర్-ఫైడింగ్ వద్ద రైల్వే లైన్ కొండచరియలు విరిగిపడటంతో రైళ్లను రద్దు చేశారు.

గెరెమ్లాంబ్రా గ్రామం వద్ద మైబాంగ్ సొరంగం చేరుకోవడానికి ముందు, కొండచరియలు విరిగిపడటంతో రహదారి కూడా బ్లాక్ అయ్యిందని అధికారులు పేర్కోన్నారు. ఇప్పటికే బయలుదేరిన రెండు రైళ్లు వరదల్లో చిక్కుకున్నాయి. ఒక్కో దాంట్లో 1400 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. కాగా, ఎయిర్‌ఫోర్స్ సాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డిటోక్‌చెర్రా స్టేషన్‌లో 1,245 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని బదార్‌పూర్, సిల్చర్ రైల్వే స్టేషన్లకు తరలించారు. అలాగే, 119 మంది ప్రయాణికులను భారత వైమానిక దళం సిల్చర్‌కు తరలించింది. చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆహారం, తాగు నీరు సరఫరా చేస్తున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh