Reduce Your Sitting Time to Boost Health రోజుకో గంట శారీరిక శ్రమ.. ఆరోగ్యానికి శ్రీరామరక్ష: అధ్యయనం

Reduce sitting time by one hour a day to see health benefits

sedentary time, sitting, Journal of Science and Medicine, New Study, Finland, Three months, cardiavascular health, type 2 diabetes, Physical activity

Comparisons of sitting to smoking and advice on reducing sedentary time have both become common refrain. According to a new study in Journal of Science and Medicine, just three months of moving an additional hour per day can provide meaningful changes to cardiovascular health and type 2 diabetes risk—particularly if that’s paired with more physical activity.

రోజుకో గంట శారీరిక శ్రమ.. ఆరోగ్యానికి శ్రీరామరక్ష: అధ్యయనం

Posted: 05/14/2022 06:28 PM IST
Reduce sitting time by one hour a day to see health benefits

రోజుకో గంట వ్యాయామం చేస్తే అరోగ్య సంబంధమైన ప్రయోజనాలు సమకూరుతాయని పెద్దలు చెప్పిన మాట. అయితే మారుతున్న జీవనశైలికి తోడు మనం తీసుకుంటున్న జంక్ ఫుడ్ కూడా ఊభకాయానికి దోహదపడుతోంది. ఈ సమస్య తలెల్తిన వారిలో గుండెసంబంధిత సమస్యతో పాటు టైప్ 2 డయాబెటిస్ సమస్య కూడా ఉత్పన్నం అవుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బాధపడుతున్నారు. కదలికలు పెద్దగా లేని జీవనశైలితో ఆరోగ్యపరమైన ముప్పు ఉంటుందని తెలిసింది. అందుకని శరీరానికి తగినంత కదలికలు ఉండేలా చూసుకోవాలి. ప్రతీరోజు గంట పాటు ఎక్కువ కష్టం లేకుండా కేవలం నడిచినా చాలునని కూడా వైద్యులు చెబుతున్నారు.

ఇలా చేస్తే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని.. తాజాగా ఫిన్ ల్యాండ్ వైద్యులు జరిపిన అధ్యయనం కూడా వెల్లడించింది. జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఈ తాజా అధ్యయనం వివరాల ప్రకారం నిశ్చలమైన జీవనాన్ని రోజులో గంట తగ్గించలిగినా ఎంతో కొంత ఆరోగ్యానికి మంచి జరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. గుండె ఆరోగ్యం, టైప్-2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని ఫిన్ల్యాండ్ పరిశోధకులు తెలిపారు. తాము జరిపిన అధ్యయనంలో మధ్య వయసులో నిశ్చిలమైన జీవనాన్ని గుడుపుతున్న 64 మందిని (మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారు) ఎంపిక చేశారు. రెండు గ్రూపులుగా చేశారు.

ఒక గ్రూపులోని వారికి నిత్యం గంటపాటు కదలికలు ఉండేలా చూశారు. నించోవడం, అటూ ఇటూ కదలడం, స్వల్ప వ్యాయామాల్లాంటివి చేయించారు. మూడు నెలల పాటు పరిశీలించారు. రక్తపోటు, రక్తంలో గ్లూకోజును కూడా చెక్ చేశారు. దీంతో కదలికల్లేని గ్రూపులోని వారితో పోలిస్తే.. కనీసం గంటపాటు శారీరకంగా శ్రమించే వారికి బ్లడ్ షుగర్ నియంత్రణ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు తెలుసుకున్నారు. శారీరకంగా తగినంత కదలికల్లేని వారు, అలానే కొనసాగి ముప్పు తెచ్చుకోవడం ఎందుకు..? కనీసం వీలైనంత సమయం నడవడం, ఇతర కసరత్తులు చేయాలి. కదలికల్లేని సమయాన్ని వీలైనంత మేర తగ్గించుకోగలిగితే చాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles