YSRCP govt facing ire of public: Nadendla Manohar గడపగడపలో వైసీపీకి చిత్కారాలు.. జగన్ రెడ్డిలో ఆందోళన: నాదేండ్ల

Nadendla manohar slams ycp govt over fullfilling election promises

Nadendla Manohar, Janasena, PAC chairman, Election Promises, abolition of CPS, liquor shops, Job Calender, YS Jagan, Andhra Pradesh, Politics

Jana Sena leader Nadendla Manohar on Saturday came down heavily on YSRCP government. He said that the Chief Minister YS Jagan Mohan Reddy had failed to fulfil the promises made during the elections, he said. He questioned over the job calendar mentioned in the manifesto by YS Jagan during the polls.

గడపగడపలో వైసీపీకి చిత్కారాలు.. జగన్ రెడ్డిలో ఆందోళన: నాదేండ్ల

Posted: 05/14/2022 07:28 PM IST
Nadendla manohar slams ycp govt over fullfilling election promises

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై జనసేన పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిప‌డ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి, దీక్షలు, శిబిరాలు చేపట్టిన జగన్.. ఎన్నిక‌ల ముందు ప్రజలకిచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో విఫలమయ్యాయరని ఆయన విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని నిల‌దీశారు. కంపల్సరీ పెన్షన్ పథకం (సీపీఎస్) విషయంలో కార్మికులకు హామీనిచ్చిన జగన్ సర్కార్.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడిచినా దానిని పూర్తిగా మర్చిపోయిందని దుయ్యబట్టారు. సీపీఎస్ రద్దుపై హామీని నిలబెట్టుకోవ‌ట్లేద‌ని ఆయన డిమాండ్ చేశారు.

మద్యపాన నిషేధం విధిస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్.. ఇప్పుడు ప్ర‌తి గ్రామంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం దుకాణాల నిర్వహణ చేపట్టిన ప్రభుత్వం.. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలి.. నాణ్యతలేని మద్యాన్ని అమ్మి సోమ్ముచేసుకుందని మండిపడ్డారు. ఇన్నాళ్లు మద్యం దుకాణాలను టెండర్లలో దక్కించుకున్నవారు చేస్తే.. అరోపణలు గుప్పించిన వైసీపీ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా ప్రభుత్వమే అమ్మడం.. కరోనా లాంటి కష్టకాలంలో మద్యందుకాణాల వద్ద కస్టమర్లను నియంత్రించే పనిలో ఉపాధ్యాయులను కూడా వినియోగించుకున్న తీరును ప్రజలు, ఉపాధ్యాయులు మర్చిపోలేదని ఆయన గుర్తుచేశారు. అలాగే,

ప్రభుత్వం చేసిన పనులతో విసిగివేసిరిన ప్రజలు.. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల‌ను నిలదీస్తున్నారని, ప్ర‌తి ఊరిలో గడప గడపలో వైసీపీ నేతలకు చీదరింపులు,  ఛీత్కారాలు ఎదుర‌వుతున్నాయ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. దీంతో పరిపాలన చేతగాని సీబీఐ దత్తపుత్రుడైన‌ జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున‌ అందించాల్సిన డ‌బ్బుల‌నూ స‌ర్కారు ఇవ్వ‌ట్లేద‌ని ఆరోపించారు. నోటికొచ్చినట్లు జ‌గ‌న్ అబద్ధాలు చెబుతున్నార‌ని ఆయ‌న విమర్శించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles