దేశంలోని పేదల సంక్షేమాన్ని నిత్యం జపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. నిజానికి దేశ:లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను మరింత ఉన్నతస్థాయిలో నిలిపే ప్రయత్నాలే చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని పెదవులను దాటి వచ్చే పేదల అన్న మాట.. కేవలం జపం మాత్రమేనని, కానీ వారి కోసం ఆయన చేసింది ఏమీ లేదని రాహుల్ తీవ్రంగా దుయ్యబట్టారు. వారికోసం కేంద్రంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, వాటికి విధిల్చిన నిధులు చూస్తే ఈ విషయం ఎవరికైనా అవగతం అవుతుందని పేర్కోన్నారు.
ఈ ఏడాది చివరిలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ మంగళవారం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సంపన్నులు, పేదలు అంటూ రెండు భారత్‌లుగా సృష్టించారని మండిపడ్డారు. దేశంలో కీలక వనరులను కొద్దిమంది సంపన్నులకు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. దహోద్ జిల్లాలో ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో మోదీ దేశ ప్రధాని పగ్గాలు చేపట్టకముందు గుజరాత్ సీఎంగా ఉన్నారని, గుజరాత్లో ఆయన చేసిన పనులే ఇప్పుడు దేశంలో చేస్తున్నారని దీన్ని గుజరాత్ మోడల్‌గా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
మోదీ సంపన్నులు, పేదల కోసం సృష్టించే రెండు భారత్‌లను కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదని అన్నారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. కాషాయ సర్కార్ మీకు ఎలాంటి మేలు చేయకుండా మీ వనరులను లాగేసుకుంటోందని ఆరోపించారు. గిరిజనులు తమ హక్కులను సాధించుకుంటేనే వారికి రావాల్సిన వాటా దక్కుతుందని అన్నారు. గిరిజనుల కష్టంతో గుజరాత్లో రోడ్లు, బ్రిడ్జిలు, భవనాలు, మౌలిక వసతులు సమకూరినా వారు తిరిగి పొందింది ఏమీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులకు విద్య, వైద్యం అందుబాటులో లేదని ఆరోపించారు.
LIVE : आदिवासी सत्याग्रह रैली, दाहोद। गुजरात #AdivasiSatyagraha https://t.co/UNR627OQVj
— Rahul Gandhi (@RahulGandhi) May 10, 2022
(And get your daily news straight to your inbox)
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more
Aug 10 | దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో అనేక రాష్ట్రాలు అతలాకులం అయ్యాయి. జనజీవనం స్థంబించింది. రవాణ సదుపాయం తెగిపోయింది. అయితే వర్షం తగ్గిన వెంటనే ఎమర్జెన్సీ డిజార్టర్ సర్వీసెస్ విభాగం అధికారులు ఎక్కడికక్కడ మరమ్మత్తులు... Read more
Aug 10 | ఎక్కడైనా చేపలు పట్టాలంటే ఎంతో కొంత కష్టపడాలి. చిన్నగా అయితే గాలం వేసి చేప పడేవరకు ఓపికగా ఎదురు చూడాలి. గాలానికి చేప తగలగానే వెంటనే లాగేసి పట్టుకోవాలి. ఇక పెద్దగా అయితే వలలు... Read more
Aug 10 | ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన 'బానిసలారా లెండిరా' అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుంచి ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటను గద్దర్ స్వయంగా... Read more
Aug 10 | వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు... Read more