hazardous asteroid to come close to Earth in May భూమికి దగ్గరగా ప్రమాదకర గ్రహశకలం

1 8 kilometers wide potential hazardous asteroid to come close to earth in may

Asteroid, near earth object, asteroid flyby, hazardous asteroid, Asteroid close to earth, Asteroid close encounter with Earth, Asteroid revolving around sun, JPL, Nasa, science news

A 1.8-kilometer-wide potentially hazardous asteroid is set to come close to Earth as it passes in its orbit around the Sun. The close encounter with Earth is set for the end of this month as the asteroid streaks past at a staggering speed of 47,196 kilometers per hour.

భూమికి దగ్గరగా… 1.8 కిలోమీటర్ల వెడల్పైన ప్రమాదకర గ్రహశకలం

Posted: 05/03/2022 01:02 PM IST
1 8 kilometers wide potential hazardous asteroid to come close to earth in may

ఈ నెలలో 1.8 కిలోమీటర్ల వెడల్పైన ప్రమాదకర గ్రహశకలం భూమికి దగ్గరగా రానున్నది. సూర్యుడి చుట్టూ వలయాకారంలో తిరుగుతున్న ఈ గ్రహశకలం గంటకు 47,196 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. ఈ వేగంతో భూమికి చేరువగా సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుతానికి ఈ గ్రహశకలం వల్ల భూమికి వచ్చిన ప్రమాదమేమీ లేదని.. ఎలాంటి ముప్పు వాటిల్లదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. అయినప్పటికీ భవిష్యత్తులో మాత్రి ఈ గ్రహశకలం భూమికి ప్రమాదకారిగా మారే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేసింది. 1989లో పాలోమార్ అబ్జర్వేటరీలో దీనిని తొలిసారిగా గుర్తించినట్లు తెలిపింది.

దీంతో 1989 జేఏగా పేరు పెట్టిన ఈ గ్రహశకలం ఈ నెల 29న భూమికి దగ్గరగా వచ్చినప్పుడు బైనాక్యులర్‌ ద్వారా చూడవచ్చని పేర్కొంది. కాగా, ఈ భారీ గ్రహశకలం ఈసారి భూమికి 40,24,182 కిలోమీటర్ల సమీపం నుంచి వెళ్తుందని నాసా తెలిపింది. 1996లో 40 లక్షల కిలోమీటర్ల సమీపం నుంచి వెళ్లిన ఈ గ్రహశకలం.. తిరిగి 2029 సెప్టెంబర్‌తో పాటు 2055, 2062లో భూమికి అత్యంత చేరువుగా వెళ్తుందని వెల్లడించింది. మరోవైపు 1.3 కిలోమీటర్ల వెడల్పు ఉన్న భారీ గ్రహశకలం 138971 (2001 CB21) మార్చి 4న భూమికి 49,11,298 కిలోమీటర్ల సమీపం నుంచి దూసుకెళ్లింది. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహశకలం కేవలం 400 రోజుల్లో దాని కక్ష్యను పూర్తి చేస్తోందని నాసా పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles