AP Minister RK Roja's mobile phone stolen మంత్రి ఆర్కే రోజా మొబైల్ ఫోన్ చోరీ..

Andhra pradesh minister rk roja s mobile phone stolen in tirupati

RK Roja, AP Minister RK Roja, Minister RK roja mobile phone robbed, Minister RK roja mobile phone theft, Minister RK roja mobile phone stolen, Minister RK roja mobile phone, Tirupati Police, Tirupati police found Thief, AP Minister mobile phone robbed, AP Minister mobile phone stolen, AP Minister mobile phone missing, AP Minister, Mobile Phone, stolen, contract worker, Tirumala visit, Padmavati Guest House, Tirumala, Tirupati, Andhra Pradesh. Crime

This is a direct example of how even thieves in Tirupati, the spiritual city of Andhra Pradesh, are becoming obsessed with displaying their handiwork. It is a known fact that the devotees who come to tirumal have to take care of not only their belongings but also the children. Andhra Pradesh Minister of State Arke Roja's mobile phone was recently stolen by an contract worker from Padmavati Guest House in Tirupati.

మంత్రి హోదాలో తిరుపతికి ఆర్కే రోజా.. మొబైల్ ఫోన్ చోరీ..

Posted: 04/21/2022 05:50 PM IST
Andhra pradesh minister rk roja s mobile phone stolen in tirupati

ఆంధ్రప్రదేశ్ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజాకు గురువారం వింత అనుభ‌వం ఎదురైంది. మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తొలిసారి త‌న సొంత జిల్లాకు వెళ్లిన రోజాకు స్థానిక నాయకుల నుంచి స్వాగతం లభించింది. ముందుగా తిరుమ‌ల‌లో క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నా అమె.. ఇవాళ తిరుప‌తిలో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గోన్నారు. మంత్రి హోదాలో తొలిసారిగా వచ్చిన అమెను అభినందించేందుకు స్థానిక నేతలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. పుష్పగుచ్చాలు అందించారు. దీంతో మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌కు చేరుకున్న అమెను స‌న్మానించేందుకు అధికారులు, వైసీపీ నేత‌లు పోటీ ప‌డ్డారు.

అయితే సందెట్లో సడేమియా అన్నట్లు ఎవరి పనిలో వారు నిమగ్నం కాగా, తమ పనిలో తాము నిమగ్నం కావాలని అక్కడికి వచ్చిన ఓ హస్తలాఘవుడు ఏకంగా మంత్రి రోజా మొటైల్ ఫోన్ నే టార్గెట్ చేశాడు. భారీ జ‌న సందోహం నెల‌కొనడమే అదును భావించిన దొంగ.. అదే అద‌నుగా భావించి మంత్రి మొబైల్ ఫోన్‌ను త‌స్క‌రించేశాడు. త‌న సెల్ ఫోన్ క‌నిపించ‌క‌పోయే స‌రికి రోజా కంగారు ప‌డ్డారు. వెంట‌నే ప‌క్క‌నే ఉన్న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి మొబైల్ ఫోన్ చోరీకి గురైంద‌న్న ఫిర్యాదుతో పోలీసులు కూడా వెనువెంట‌నే రంగంలోకి దిగేశారు. అక్క‌డి సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించారు. అందులో రోజా మొబైల్‌ను చోరీ చేసిన వ్య‌క్తిని గుర్తించారు.

మంత్రి సెల్ ఫోన్‌ను త‌స్క‌రించేసిన వ్య‌క్తి,.. ఫోన్‌తో కారు ఎక్కేసి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. కారు నెంబ‌రు ఆధారంగా పోలీసులు అత‌డి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌లో రోజా సెల్ ఫోన్‌ను కొట్టేసిన స‌ద‌రు వ్య‌క్తి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎస్వీ యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోకి వెళ్లిన‌ట్టుగా గుర్తించారు.వెంట‌నే అక్క‌డికి ప‌రుగులు పెట్టిన పోలీసులు ఎట్ట‌కేల‌కు దొంగ‌ను ప‌ట్టుకున్నారు. అత‌డి నుంచి రోజా సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచార‌ణ‌లో భాగంగా అత‌డు కాంట్రాక్టు ఉద్యోగి అని తేలింది. చోరీకి గురైన మంత్రి ఫోన్ దొర‌క‌డంతో దానిని జాగ్ర‌త్త‌గా తీసుకుని వ‌చ్చి రోజాకు అప్ప‌గించారు. మొబైల్ ఫోన్ చోరీ గురైన స‌మ‌యం నుంచి తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురైన రోజా... కాసేప‌టికే అది త‌న వ‌ద్ద‌కు చేరుకోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles