"Put bombs on those trains" anonymous threat call.! ఆ రైళ్లలో బాంబులు పెట్టామంటూ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్.!

Bomb threat to trains running from visakha to secundrabad anonymous call

Anonymous call, phone call, Bombs planted in Trains, bombs planted in trains running from Visakhapatnam, Bomb in Train, Unknown persons call to Police, LTT Express, Khazipet, Konark Express, Charlapalli, train bomb news, bomb in vishaka train, Hoax call, Andhra Pradesh, Telangana, Crime

Anonymous person called the railway officials that a bomb had been planted on the trains that are running from visakhapatnam to secundrabad. Based on this call the Raiway protection force and civil police had stopped the trains and thoroughly checked out with dog squard. and assumed that the phone call is a hoax call.

ఆ రైళ్లలో బాంబులు పెట్టామంటూ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్.!

Posted: 04/13/2022 03:01 PM IST
Bomb threat to trains running from visakha to secundrabad anonymous call

తమ తమ పనుల్లో నిమగ్నమైన పోలీసులు అధికారులకు వచ్చిన ఆ ఒక్క ఫోన్ కాల్ వారిని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఆదేవరు చేశారు.? ఆ ఫోన్ కాల్ సారాంశమేంటీ అంటే.. ‘‘విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే రైళ్లలో బాంబు పెట్టాం’’ అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్ కాల్ పోలీసులను అన్ని పనులు పక్కనబెట్టి యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకునేలా చేసింది. దీంతో సమాచారాన్ని ఓ వైపు పోలీసులు ఉన్నతాధికారులతో పంచుకోవడంతో పాటు అదే సమయంలో మరోకరు విశాఖపట్నం నుంచి బయలుదేరిన రైళ్ల సమాచారం. ప్రస్తుతం ఆయా రైళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నారు.

ఇదే సమయంలో మరోకరు బాంబ్ స్వాడ్, డాగ్ స్వాడ్ అధికారులకు కూడా సమాచారాన్ని చేరవేశారు. ఇక రంగంలోకి దిగిన లా అండ్ ఆర్డర్ పోలీసులు వచ్చిన ఫోన్ నెంబరు ఎవరిదీ.? అన్న సమాచారం రాబట్టే పనిలో వున్నారు. ఇక రైల్వే పోలీసులు నుంచి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ చేరుకుంటున్న రైళ్తను నిలిపి తనిఖీలు నిర్వహించారు. కాజీపేటలోని ఎల్​టీటీ ఎక్స్​ప్రెస్​, చర్లపల్లి వద్ద కోణార్క్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లను ఆపి.. పోలీసులు సోదాలు నిర్వహించారు. రైలు బోగీల్లో జాగీలలతో తనిఖీలు చేపట్టారు.

పోలీసుల తనిఖీలు చూసి... రైళ్లలో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఏం అవుతుందో అని.. భయాందోళనకు గురై అయ్యారు. చివరకు పోలీసులు... అది ఫేక్‌ కాల్‌గా గుర్తించారు. రైళ్లను పంపించి ఎక్కడా ఎలాంటి ప్రమాదం జరగలేదని ఊపిరి పీల్చుకున్నారు. ఓ ఆగంతకుడు ఇవాళ ఉదయం పోలీసులు క్విక్ రెస్పాన్సివ్ నెంబర్ 100కు ఫోన్ చేసి.. విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లలో బాంబు పెట్టామంటూ పోన్ చేసి చెప్పాడు. ఆగంతకుడి ఫోన్​ కాల్‌తో రైల్వే రక్షక దళం పోలీసులు.. అప్రమత్తమై.. యుద్దప్రాతిపదికన రైళ్లను నిలిపి తనిఖీలు నిర్వహించి ఊపిరి పీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles