Chennai Customs foil bid to smuggle 19th century idol విమానాశ్రయంలో పురాతన విగ్రహం.. స్మగ్లింగ్ యత్నం భగ్నం..

Antique shivalingam dating back to 1800s bound for export to usa seized in chennai

Chennai Air Cargo Customs, Shivalingam, Nagabharanam, smuggle, United States, arts and crafts emporium, Kumbakonam, Gedilam, Thirunavalur, Kallakurichi district, Customs Act, Chennai, Tamil Nadu, Crime

Chennai Air Cargo Customs foiled a bid to smuggle a 19th century idol of Shivalingam with Nagabharanam to the United States. An export consignment containing the idol was intercepted by the sleuths after a tip-off.

విమానాశ్రయంలో పురాతన విగ్రహం.. స్మగ్లింగ్ యత్నం భగ్నం..

Posted: 04/09/2022 04:33 PM IST
Antique shivalingam dating back to 1800s bound for export to usa seized in chennai

తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయం నుంచి అమెరికాకు స్మగ్లింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్న అతిపురాతన కాలానికి చెందిన భగవత్ దేవతా విగ్రహాన్ని ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. 19వ శతాబ్దానికి చెందిన నాగాభరణంతో కూడిన శివలింగం విగ్రహాన్ని అమెరికాకు అక్రమంగా తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని చెన్నై ఎయిర్ కార్గో కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నారు. త్రిశూలంలోని కార్గో కేంద్రం నుంచి అమెరికాకు పంపించాల్సిన సరుకులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయడంతో 1800 నాటి ప్రాచీన విగ్రహం బయటపడింది.

విగ్రహానికి సంబంధించిన ఎగుమతి పత్రాలు (షిప్పింగ్ బిల్లు) పరిశీలించిన అధికారులకు తంజావూరు జిల్లాలోని కుంభకోణంలో ఉన్న ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎంపోరియం నుండి కొనుగోలు చేసినట్లు తెలిసింది. విగ్రహం కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నుండి నాన్-యాంటిక్విటీ సర్టిఫికేట్ ఎగుమతిదారు సమర్పించలేదని అధికారులు గుర్తించారు. కాగా అధికారుల విచారణలో ఈ పంచలోహ విగ్రహం కళ్లకురిచ్చి జిల్లా తిరునావలూరు సమీపంలోని గెడిలంలోని ఓ వ్యక్తి నుంచి లభ్యమైనట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.

అయితే ఈ విగ్రహం ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ ఎంపోరియం నుంచి కొనది కాదని తెలీయడంతో అధికారులు పురావస్తు పరిశోధనా అధికారులను రంగంలోకి దింపి పరీక్షలు నిర్వహింరచారు. వారు నిర్వహించిన దృశ్య పరీక్షలో శివలింగ నాగాభరణ విగ్రహం అతిపురాతనమైనదిగా (1800వ సంవత్సారానికి) చెందినట్లుగా కనుగొన్నారు. ఈ శివలింగ నాగాభరణ పంచలోహ విగ్రహం 36 సెం.మీ (మూడున్నర అడుగుల) ఎత్తు, 4.56 కిలోల బరువు ఉందని అధికారులు తెలిపారు. ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులకు ఈ విగ్రహం స్మగ్లింగ్ చేస్తున్నారన్న పక్క సమాచారం అందడంతో.. త్రిశూలంలోని కేంద్రంపై దాడి చేశారు. ఈ పురాతన విగ్రహంతో పాటు ఎగుమతి కోసం నమోదు చేసిన ఇతర వస్తువులను కస్టమ్స్ చట్టం, 1962, పురాతన వస్తువుల చట్టం కింద స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles