‘New trend of government maligning judges’: CJI న్యాయస్థానాలను నిందించడం ప్రభుత్వాల కొత్త ట్రెండ్: సీజేఐ

Cji nv ramana says there s a new unfortunate trend of govts maligning judges

Chief justice of India, nv ramana, cji nv ramana new trend, nv ramana on govt new trend, maligning judges, government maligning judges, Justice Krishna Murari, Justice Hima Kohli, High Court, Chhattisgarh, Principal Secretary Aman Singh, Yasmin Singh, Private parties, Supreme Court

Chief Justice of India N V Ramana said there is a “new trend” of the government “maligning” judges. The CJI, heading a bench also comprising Justices Krishna Murari and Hima Kohli, said: “It’s a new trend… Government has started maligning the judges. It’s unfortunate… We are watching in court also. Nowadays, it’s a new trend. Earlier, we used to see private parties with this type of tactic. We are watching every day.”

న్యాయస్థానాలను నిందించడం ప్రభుత్వాల కొత్త ట్రెండ్: సీజేఐ ఎన్వీ రమణ

Posted: 04/09/2022 03:31 PM IST
Cji nv ramana says there s a new unfortunate trend of govts maligning judges

తమకు అనుకూలంగా తీర్పులను వెలువరించని పక్షంలో న్యాయమూర్తులను, న్యాయస్థానాలను నిందించడం ప్రభుత్వాలకు కొత్త ట్రెండ్ గా మారిందని దేశ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నర్మగర్భవాఖ్యలు చేశారు. కోర్టులను ప్రభుత్వాలు విమర్శిస్తుండటం ఇటీవలి కాలంలో మరీ అధికమైయ్యిందని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే పనిగట్టుకుని తమకు అనుకూలంగా తీర్పులు రానీ పక్షంలో ప్రభుత్వాలే పనిగట్టుకుని న్యాయస్థానాలను, న్యాయమూర్తులను నిందించడం దరదృష్టకరమని పేర్కోన్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలను చాలానే చూస్తున్నామని పేర్కోన్నారు. ఇది ప్రభుత్వాలకు కొత్త ట్రెండ్ గా మారిందని అన్నారు.

ఇదివరకు ప్రైవేటు పార్టీలు ఇలాంటి టాక్టిక్స్ అములు చేసేవని, అయితే ఇప్పుడు ఆ జాబితాలో ప్రభుత్వాలు కూడా చేరిపోయాయని భారత ప్రధాన న్యాయమూర్తి అందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, చత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ హాయంలో చత్తిస్ గడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అమన్ సింగ్, ఆయన భార్య యాస్మిన్ సింగ్ లపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసును 2020లో చత్తీస్ గఢ్ హైకోర్టు కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, జడ్జీలను ప్రభుత్వాలు దూషించడం కొత్త ట్రెండ్ గా మారిందని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయమని చెప్పారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులు ఇలా వ్యవహరించేవారని... ఇప్పుడు ప్రభుత్వాలే అలా వ్యవహరిస్తుండటం దారుణమని అన్నారు. న్యాయమూర్తులపై ప్రభుత్వాలు దుష్ప్రచారాలకు పాల్పడటం ప్రారంభమయిందని చెప్పారు. ఇలాంటి వాటిని తాము ప్రతి రోజు కోర్టుల్లో చూస్తున్నామని తెలిపారు. కోర్టులను కించపరచడానికి ప్రయత్నించవద్దని అన్నారు. అయితే ఈ సందర్భంగా చత్తీస్ గఢ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది దవే మాట్లాడుతూ, తాము ఎవరినీ కించపరచడం లేదని కోర్టుకు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles