Groom ended up garlanding mother-in-law, what happens next అమ్మాయికి బదులు అత్త మెడలో దండ.. ఆ తరువాత..

Groom ended up garlanding mother in law what happens next will shock you

Groom ended up garlanding mother-in-law, Groom unconcious during his wedding, groom inebriated conditon, groom boozea heavily on his marriage, groom on wedding stage, groom during jayamala, what happens next will shock you? Watch viral video, Groom, inebriated condition, boozed, marriage, jayamala, bride, mother in law, chandigarh, viral video, video viral

Groom should have been careful, because the blunder that he made was linked to him Mother-in-law. During Jaymala on the stage, the groom was to garland his bride, but he almost ended up putting it in his mother-in-law’s neck, shocking and embarrassing the guests and relatives. Also, the groom in the video is seen drunk and before he could realize the mistake he made and fell on the sofa next to him. The video of the wedding has gone viral.

ITEMVIDEOS: అమ్మాయికి బదులు.. అత్త మెడలో దండ.. ఆ తరువాత..

Posted: 04/01/2022 09:49 PM IST
Groom ended up garlanding mother in law what happens next will shock you

పెళ్లి తంతుల్లో విచిత్రమైన సంఘటనలు చాలానే జరుగుతుంటాయి. మరి సోషల్ మీడియా వాడకం ఎక్కువైన తర్వాత ఎంత చిన్న విషయమైనా విస్తృతంగా వైరల్ అవుతోంది. వరుడు, వధువును కొట్టడమో, పెళ్లికొడుకంటే ఇష్టం లేదని వధువు అందరి ముందు చెప్పి పెళ్లిపీటలపై నుంచి వెళ్లిపోవడం, ఆనందంతో వధువు పెళ్లి వేదికపైనే డ్యాన్స్ చేయడం ఇలా ఎన్నో సంఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. కానీ ఘటన మాత్రం వీటిన్నింటింకి విభిన్నం. వివాహం అని తెలిసి కూడా పీకలదాక తాగి వచ్చి దండ అమ్మాయికి బదులు అత్త మెడలో వేయబోయాడు ఓ పెళ్లి కొడుకు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వీడియోను గమనిస్తే.. పెళ్లి వేదికపై వరుడు, వధువుతో పాటు ఆమె తల్లి.. ఇతర బంధు, మిత్రులు ఉంటారు. అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న పెళ్లి కొడుకు ఊగుతూ ఉన్నాడు. మంచి నిషా మీద ఉన్న మనోడు దండను అమ్మాయి మెడలో వేయాల్సింది పోయి.. అత్త(వధువు తల్లి) మెడలో వేయబోతాడు. పక్కనున్న వారు అతడిని వారించడంతో వెనక్కితగ్గుతాడు. సీన్ ఇంకా అప్పుడే అయిపోలేదు. దండను తీసుకుని మరోసారి వధువు మెడలో వేయడానికి ప్రయత్నించాడు. ఎంత తాగి ఉన్నాడో ఏమో కానీ.. వధువు మెడలో దండ వేయకుండానే తూలుతూ కిందపడిపోతాడు. అక్కడ ఉన్న కూర్చీని ఆనుకుని సేద తీరుతూ ఉంటాడు.

అత్త మెడలో దండ వేయబోవడం అలా ఉంచితే.. వధువుకు దండ వేయకుండా తూలుతూ కింద పడటం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియో విపరీతంగా వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. పెళ్లి అనగానే సంతోషంలో కాస్త ఎక్కువగా తాగినట్టున్నాడు అని ఒకరు స్పందించగా.. పెళ్లి రోజు కాస్త తాగాల్సింది అని మరోకరు స్పందించారు. ఏది ఏమైతేనేం పెళ్లిలో మత్తులో తూలుతూ.. ఊగుతూ వివాహం చేసుకున్నాడు.

 
 
 
View this post on Instagram

A post shared by CHUTIYAPA 3M (@_.chutiyapa._)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Groom  inebriated condition  boozed  marriage  jayamala  bride  mother in law  chandigarh  viral video  video viral  

Other Articles