Woman Assaults Boyfriend, Gets Thrashed by Delivery boy నడిరోడ్డుపై యువతి చాచిపెట్టి కోట్టిన డెలివరీ బాయ్.!

Food delivery boy intervenes in lovers spat thrashes girl for abusing boyfriend

Odisha: Food delivery boy intervenes in lovers’ spat, thrashes girl for abusing boyfriend, overs spat, food delivery boy, swiggy executive, public spat, thrashed woman, physically abuse, boy friend, Bhubaneswar, Odisha, Crime

A lover’s spat turned into an all-out brawl after a food delivery executive intervened and soundly thrashed the girl in full public glare in Odisha’s Bhubaneswar. The video of the incident has gone viral. According to reports, the girl got into a heated argument with her boyfriend after coming out of Indira Gandhi Park. The video shows her verbally and physically abusing her boyfriend, and even throwing a rock at him.

ITEMVIDEOS: నడిరోడ్డుపై యువతి చాచిపెట్టి కోట్టిన డెలివరీ బాయ్.!

Posted: 04/01/2022 08:48 PM IST
Food delivery boy intervenes in lovers spat thrashes girl for abusing boyfriend

ఎవరైనా గొడవ పడుతుంటే.. వారిని అదుపు చేయడం ఒకింత కష్టమే. ఇలాంటి గోడవలను సద్దుమణిగిద్దామని మధ్యలోకి ఎంట్రీ ఇచ్చినవారి మెడకే చుట్టుకుంటాయి. ఇక భార్యాభర్తలైతే.. మధ్యలో జోక్యం చేసుకున్నవారు.. వార్నీ.. ఇంతసేవు తిట్టుకున్నారు.. ఇప్పుడు ఇద్దరూ కలసి నన్నే తిట్టేస్తున్నారు.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోక తప్పదు. ఇదే విషయం ఇద్దరు ప్రేమికుల మధ్యలో జరిగినా అదే పరిణామం ఎదురవుతుంది. చూస్తూ.. చూస్తూ మరీ వారిద్దరి అలానే వదిలేయలేం కదా.. అంటే.. చెప్పడం మా ధర్మం.. అని మాత్రమే చెప్పగలం. ఇలా మా మాట వినని ఓ డెలివరీ బాయ్ కు ఎదురైన అనుభవం ఏంటో తెలుసుకుందామా.?

ఒడిశాలో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రేమికుల గొడవ మధ్యలోకి వెళ్లాడు ఓ ఫుడ్​ డెలివరీ బాయ్​. చివరికి వారిద్దరి గొడవ కాస్తా.. డెలివరీ బాయ్.. మహిళ మధ్య గోడవగా మారింది. అంతేకాదు.. మంచి మాటలు చెప్పి.. వారిద్దరనీ సంయమన పర్చేద్దామనుకున్న డెలివరీ బాయ్.. తనకు ఎదురైన వింత అనుభవంతో.. ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అప్పటివరకు ఎంతో సమ్యంగా ఉన్న ఆయన ఆ అనుభవంతో తనలోని ఆగ్రహాం కట్టలు తెంచుకోవడంతో ఏకంగా మహిళను చాచిపెట్టి చెంపదెబ్బ కొట్టడమే కాకుండా అమెపై దాడి చేశారు. అదేంటి గోడవను చల్లబర్చుదామని వెళ్లిన వ్యక్తి ఇలా ఎందుకు మారాడు.. అనుకుంటున్నారా..

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాజధాని భువనేశ్వర్​లో.. మిట్టమధ్యాహ్నం ఓ మహిళ.. నడిరోడ్డు మీద తన ప్రియుడితో వాగ్వాదానికి దిగింది. అతడిపై గట్టిగా అరుస్తోంది. అక్కడితో ఆగకుండా అమె తన ఎదురుగా వున్న తన ప్రియుడి చెంప చెల్లుమనిపించింది. అర్రెర్రే అనుకున్న స్థానికులు ప్రియుడు ఏంచేశాడో అందుకనే కొట్టిందని కొందరు.. ఈ ఆడపిల్ల.. అలా మగవాణ్ణి రోడ్డుపై చెంపదెబ్బ కోట్టేసిందే అని మరికొందరూ అనుకున్నారు. అయినా వారెవ్వరూ గొడవను అపేందుకు ప్రయత్నించలేదు. కేవలం ప్రేక్షకుల మాదిరిగా చూస్తూ ఉండిపోయారు. ఈ దృశ్యాలను కొందరు వీడియోలు తీస్తుండగా.. యువతి.. వారి ఫోన్లను లాక్కునేందుకు ప్రయత్నించింది.

అయితే.. తన బాయ్​ఫ్రెండ్​ తనని మోసం చేస్తున్నాడని ఆ మహిళ ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి.. వేరే మహిళతో కలిసి తిరుగుతున్నాడని, అందుకే అతడిని కొడుతున్నట్టు గట్టిగా అరిచింది. ఈ దృశ్యాలను ప్రజలందరు చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపటికి ఓ స్విగ్గీ డెలివరీ బాయ్​.. అదే రోడ్డు మీద వెళ్లాడు. ప్రియుడుని మహిళ కొట్టడం చూసి.. పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించాడు. కానీ మరో వ్యక్తి తమ మధ్య దూరడంతో ఆ మహిళకు కోపం మరింత పెరిగింది. బూతులు తిట్టడం మొదలుపెట్టింది. అలా తిట్టొద్దని, వెళ్లిపోవాలని డెలివరీ బాయ్​ అభ్యర్థించినట్టు సమాచారం. కానీ ఆ మహిళ వినలేదు.

ఫలితంగా వారిద్దరికి గొడవ మొదలైంది. చివరికి ఆ మహిళ.. ఆ డెలివరీ బాయ్​ చెంప చెళ్లుమనిపించేలా కొట్టింది. ఇక అప్పటివరకు ప్రశాంతంగా మాట్లాడిన డెలివరీ బాయ్​కు ఒక్కసారిగా పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే నడిరోడ్డు మీద ఆ మహిళను కొట్టడం మొదలపెట్టాడు. ముఖం, శరీరం మీద దాడి చేశాడు. కొద్దిసేపటికి స్థానికులు వారిని అదుపు చేసి, వేరు చేశారు. స్థానికులు ఈ దృశ్యాలను తమ ఫొన్​లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. కాగా.. ఈ ఘటనపై మహిళ, ఆమె ప్రియుడు, డెలివరీ బాయ్​.. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles