World’s largest plane destroyed in Russia-Ukraine war రష్యన్ దాడుల్లో ప్రపంచ అతిపెద్ద విమానం ఏఎన్​-225 ధ్వంసం

World s largest plane ukraine s mriya destroyed in russian attack

Antonov AN-225, what is Antonov AN-225, Antonov AN-225 destroyed Russia, Russia-Ukraine war, Ukraine, Mriya, russia, putin, russia ukraine war, Russia Ukraine War, Ukraine crisis, Russian soldiers, Kyiv, Russia- Ukraine crises, Ukraine

Amid Moscow’s assault on Ukraine, the world’s largest cargo aircraft, the Antonov AN-225 or ‘Mriya’, was destroyed by Russian troops during an attack on an airport near Kyiv, Ukrainian authorities announced Monday. According to Ukrainian officials, the plane was extensively damaged after Russian troops entered a Ukrainian air base in Hostomel, where the aircraft was parked.

ఉక్రెయిన్ కు చెందిన ప్రపంచ అతిపెద్ద విమానం ఏఎన్​-225 ధ్వంసం

Posted: 02/28/2022 11:41 AM IST
World s largest plane ukraine s mriya destroyed in russian attack

రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరపోరుతో జరుగుతోంది. దీంతో ఈ దేశం నుంచి లక్షల మంది శరణార్థులుగా ఇతరదేశాలకు వలసవెళ్లిపోతున్నారు. ఉక్రెయిన్ పై పట్టుకోసం పరితపిస్తున్న రష్యా.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఏఎన్-225పై కూడా బాంబులను విసిర ధ్వంసం చేసింది. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతూ.. రాజధాని కీవ్‌ నగరంపై పట్టు సాధించే దిశగా రష్యన్‌ సేనలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కీవ్‌ సరిహద్దుల్లో మోహరించి ఉన్న పుతిన్‌ బలగాలు.. హోస్టోమెల్‌ విమానాశ్రయంపై బాంబులు విసిరాయి. దీంతో అక్కడే ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఏఎన్‌-225 'మ్రియా' ధ్వంసమైంది.

ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ట్విట్టర్‌ వేదికగా సోమవారం వెల్లడించారు. మ్రియా అంటే ఉక్రెయిన్‌ భాషలో 'కల' అని అర్థం. అయితే, దీన్ని మళ్లీ పునర్ నిర్మిస్తామని ఉక్రెయిన్‌ ప్రతినబూనింది. అలాగే స్వేచ్ఛాయుత, బలమైన ప్రజాస్వామ్య యూరోప్ దేశంగా ఉక్రెయిన్‌ను నెలకొల్పాలన్న తమ కలను సైతం నిజం చేసుకుంటామని వ్యాఖ్యానించింది. మ్రియా విమానాన్ని కూల్చగలిగారు కానీ, మా కలను మాత్రం ధ్వంసం చేయలేరు అని ఉక్రెయిన్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రాసుకొచ్చారు మంత్రి.

రష్యాన్ దళాలు విసిరిన బాంబు దాడిలో ధ్వంసమైన విమానం ప్రస్తుతం ఏ దశలో ఉందన్న విషయాన్ని కూడా వివరించలేమని మంత్రి అన్నారు. ఈ విమానాన్ని ఉక్రెయిన్‌కు చెందిన ఎరోనాటిక్స్ సంస్థ ఆంటొనోవ్‌ తయారు చేసింది. ఏఎన్​-225 రెక్కలు సుమారు 290(84 మీటర్లు) అడుగుల మేర ఉంటాయి. ప్రపంచంలో కేవలం రెండో విమానాలు భారీస్థాయిలో రెక్కలతో తయారు చేశారు. రష్యా దాడిపై స్పందిస్తూ.. ప్రస్తుతం ఏఎన్‌-225 పరిస్థితి ఏ దశలో ఉందో వివరించలేమని తెలిపింది. సాంకేతిక నిపుణులు పరిశీలించిన తర్వాతే దాని కండిషన్‌ను చెప్పగలమని తెలిపింది.

మరోవైపు కీవ్‌ నగరంలోకి దూసుకెళ్లేందుకు యత్నిస్తున్న రష్యా బలగాలను నిలువరించేందుకుగానూ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌లో ఉండే కొన్ని కీలక సాధనాలను డీయాక్టివేట్‌ చేసింది. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పరిస్థితులు, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండే రద్దీకి సంబంధించిన సమాచారం తెలియకుండా చేసింది. తద్వారా రష్యా సేనల దాడుల నుంచి స్థానిక ఉక్రెయిన్‌ ప్రజలకు భద్రత లభిస్తుందని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. రోడ్లపై ఉండే ట్రాఫిక్‌ గుర్తులు, వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గాలను సూచించే సూచికలను సైతం స్థానిక సంస్థలు తొలగించాయి. తద్వారా రష్యన్ బలగాలకు ఎటువెళ్లాలో తెలియని గందరగోళ పరిస్థితి తలెత్తింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles