man survives after a train passed over him in Fatuha రైలుపట్టాలపై పడిగానే... రైలు దూసుకువచ్చింది..

Miraculous escape man survives after a train passed over him in bihar

miraculous escape of a Passenger, man survives without a bruise, man survives after a train passed over, man survives after slipped and fell on railway tracks, miraculous escape at Fatuha junction, miraculous escape of a Man in Bihar, miraculous escape, Man survives, train passes over him, railway tracks, Fatuha junction, Patna, Bihar, Crime

In a miraculous escape, a man survived without a bruise after a train passed over him when he slipped and fell on railway tracks. The incident occurred on platform number one of Fatuha junction near Patna in Bihar.

మృత్యుంజయుడు: రైలుపట్టాలపై పడిగానే... రైలు దూసుకువచ్చింది..

Posted: 02/26/2022 07:45 PM IST
Miraculous escape man survives after a train passed over him in bihar

వీడు మృత్యుంజయుడు అని ఎవరైనా ఎవరినైనా అన్నారంటే అతడు మరణాన్ని కూడా జయించినవాడని అర్థం. సాధారణంగా ఈ పదం వినబడదు. అయితే అత్యంత అరుదైన ఘటనల్లో మరణం అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చినవారినే మృత్యుంజయులు అని పిలుస్తుంటారు. అలాంటి అరుదైన ఘటనను ఎదుర్కోన్న ఈ వ్యక్తిని బిహార్ రాష్ట్రంలోని పాట్నా సమీపంలోగల ఫటుహా రైల్వే జంక్షన్ లోని ప్రయాణికులు మృత్యుంజయుడు అని అంటున్నారు. అతడికి మరణం రైలు రూపంలో కబళించేందుకు వచ్చినా.. తాను మృత్యువును అత్యంత చాకచక్యంగా, సమయస్పూర్తితో ఎదుర్కోని జయించడమే కారణం.

ఇంతకీ ఎం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.. రైలు కోసం అందరు ప్రయాణికుల మాదిరిగానే అతను నిల్చున్నాడు. అనుకోకుండా సరిగ్గా రైలు వస్తున్న సమయంలో కాలుజారడంతో అదుపుతప్పి పట్టాలపై పడిపోయాడు. మరోవైపు ఈ లోగా రైలు దూసుకువచ్చింది. దీంతో పట్టాల మధ్యలో కదలకుండా అలాగే ఉండిపోయాడు. రైలు వెళ్లిపోగానే లేచి ప్లాట్​ఫామ్​పైకి పరుగులు పెట్టాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే మృత్యుశకటం దూసుకువచ్చినా.. వ్యక్తి చాకచక్యంగా తప్పించుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : miraculous escape  Man survives  train passes over him  railway tracks  Fatuha junction  Patna  Bihar  Crime  

Other Articles