Former MP Yadlapati Venkat Rao passes away టీడీపీ తీవ్ర విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత

Former ap minister and rajya sabha member yadlapati venkatrao dies at 102

Yadlapati Venkata Rao, Veteran TDP Leader, Acharya N G Ranga, Congress member, Marri Channa Reddy, Konijeti Rosaiah, TDP, Andhra Pradesh, Politics

Veteran Telugu Desam leader Yadlapati Venkata Rao passed away due to old age in Hyderabad early on Monday. He was 102 years old. He breathed his last in his daughter’s residence in Hyderabad, where he had been staying for some time now.

టీడీపీ తీవ్ర విషాదం.. మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత

Posted: 02/28/2022 12:37 PM IST
Former ap minister and rajya sabha member yadlapati venkatrao dies at 102

తెలుగు దేశం పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు(102) కన్నుమూశారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆయన కుమార్తె ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడించారు. కాగా, 1919లో గుంటూరు జిల్లా బోడపాడులో జన్మించిన ఆయన, రైతు నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1983లో కాంగ్రెస్‌ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 2004లో రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. యడ్లపాటి మృతిపట్ల టీడీపీ శ్రేణులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

యడ్లపాటి వెంకట్రావు మరణం తమకు తమ పార్టీకి తీరని విషాదాన్ని మిగిల్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. యడ్లపాటి నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా యడ్లపాటి వెంకట్రావు సేవలను కొనియాడిన చంద్రబాబు.. ఆయన గోప్ప ‘రాజకీయ దురంధరుడని ఆయన మృతి చాలా బాధాకరని అన్నారు. అధికారం కోసం కాకుండా ప్రజలకు సేవ చేసే విషయంలో ఎప్పటికీ ఆయన ఆదర్శంగా నిలిచిపోతారని చంద్రబాబు పేర్కోన్నారు.

ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడిగా మారిన తర్వాత రైతు నాయకుడిగా ఎనలేని సేవలందించారని.. సమకాలిన రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా ఆయన ప్రజల గుండెలలో నిరంతరం నిలిచిపోతారని పేర్కోన్నారు. ‘‘సంగం డెయిరీ, జంపాని టైక్స్‌టైల్‌ మిల్స్‌ స్థాపనలకు యడ్లపాటి కృషి చేశారు. నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచీ యడ్లపాటితో పరిచయం ఉంది. ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించే అజాతశత్రువు. నేనంటే చాలా అభిమానం చూపేవారు. ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలని, రైతుల మేలు గురించే మాట్లాడేవారు. ఆయన ఆశయాలు, ప్రజా సేవ ఎప్పటికీ ఆదర్శంగా ఉంటాయి’’ అని చంద్రబాబు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles