MLA Jagga Reddy U-turn on quitting party రాజీనామా యోచనపై వెనక్కుతగ్గిన జగ్గారెడ్డి

Congress sangareddy mla jagga reddy u turn on quitting party

congress, jagga reddy, Sangareddy MLA, TPCC working president, Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi, former MP V Hanumantha Rao, TPCC president, A Revanth Reddy, AICC president Sonia Gandhi, sangareddy, telangana Congress, Telangana, Politics

The State unit of Congress party is gets a big relief as Sangareddy MLA and TPCC working president T Jagga Reddy has taken a U-turn on quitting the party. Speaking at a meeting with his constituency key congress activists and his followers , the Sangareddy MLA said he will decide after the meeting with party bigwigs.

తెలంగాణ కాంగ్రెస్ కు ఊరట.. రాజీనామా యోచనపై వెనక్కుతగ్గిన జగ్గారెడ్డి

Posted: 02/26/2022 01:15 PM IST
Congress sangareddy mla jagga reddy u turn on quitting party

కాంగ్రెస్​ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) తన నిర్ణయాన్ని మార్చకున్నారు. ఇటీవల తనను సొంత పార్టీ వ్యక్తులే సోషల్ మీడియా వేదికగా అబాసుపాలు చేస్తున్నారని తీవ్రంగా అక్షేపించిన ఆయన తాను పార్టీ కోసం ఎంతో కష్టపడినా.. తనను టార్గెట్ చేస్తూ పార్టీ వ్యక్తులే దుష్ర్పచారానికి తెరలేపారని అన్నారు. అయితే ఈ క్రమంలో పార్టీని వీడుతానని ఆన్న ఆయన తాజాగా తన నిర్ణయంపై యూ-టార్న్ తీసుకున్నారు. పార్టీలోని అధినాయకత్వాన్ని కలిసేవరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నానని అన్నారు.

సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలిసే వరకు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజీనామా చేయాలా? సొంత పార్టీ పెట్టాలా..? అని జగ్గారెడ్డి కార్యకర్తలను అడగ్గా, కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండాలని వారు సూచించడం గమనార్హం. అయితే రానున్న రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తాను తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకోవడం లేదని జగ్గారెడ్డి కార్యకర్తలు, అనుచరులనుద్దేశించి వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్‌హాలులో ఆయన నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

తాను టీఆర్‌ఎస్‌ లోకి వెళ్తానని, బీజేపీలోకి జంప్ అవుతానని ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలే ఈ అసత్యప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, తన నియోజ కవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని జగ్గారెడ్డి నిర్ణయించారు. డిజిటల్‌ సభ్యత్వ నమోదు తన నియోజకవర్గంలో తక్కువగా ఉందని, ఈసారి 75 వేల కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించాలని అనుచరులు, కార్యకర్తలను కోరారు. వచ్చేనెల 10న సభ్యత్వ నమోదుపై సమీక్ష ఉంటుందని, కార్యకర్తలు 75 వేల కంటే తక్కువ సభ్యత్వం నమోదు చేస్తే తనను అవమానించినట్లే అవుతుందని, ఈ సభ్యత్వ నమో దును బట్టి తన రాజకీయ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles