Sidhu hails Channi's elevation as Punjab CM సీఎం అభ్యర్థిగా ప్రకటన.. సిద్దూ పాదాలను తాకీ చన్నీ అశీర్వాదం

Charanjit channi touches sidhu s feet soon after cong announced him as cm candidate

Charanjit Singh Channi, Rahul Gandhi, Navjot Singh Sidhu, Punjab polls, Punjab elections, Punjab congress, channi touches sidhus feet, Congress CM face punjab, punjab assembly election, punjab polls, punjab election, punjab election 2022, punjab elections 2022, punjab polls 2022, punjab congress, punjab polls, punjab, Politics

As Congress leader Rahul Gandhi declared Charanjit Singh Channi as his party's chief ministerial face for the high-stakes Punjab Assembly polls, the first Dalit chief minister of the state was seen touching the feet of Navjot Singh Sidhu. Sidhu,, who was considered one of the main contenders of the top post, then rose from his seat, held Channi’s hand and raised it in a rare show of unity.

సీఎం అభ్యర్థిగా ప్రకటన.. సిద్దూ పాదాలను తాకీ చన్నీ అశీర్వాదం

Posted: 02/07/2022 04:31 PM IST
Charanjit channi touches sidhu s feet soon after cong announced him as cm candidate

పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంలో రోజుల తరబడి ఉత్కంఠకు తెరదించుతూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలోనే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రిగా కోనసాగుతున్న చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ పేరును ఖరారు చేసింది హస్తం పార్టీ. లూథియానాలో జరిగిన వర్చువల్‌ సభలో రాహుల్‌ గాంధీ ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటించగానే చన్నీ.. పక్కనే కూర్చున్న పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పాదాలను తాకి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం తీవ్రస్థాయిలో పోటీ పడ్డ సిద్ధూ, చన్నీ ఈ వేదికపై పక్కపక్కనే కూర్చున్నారు. రాహుల్.. చన్నీ పేరును ప్రకటించగానే పక్కనే ఉన్న సిద్ధూ ఆయనను అభినందించారు. ఆయనను గుండెలకు హత్తుకున్నారు. చన్నీ చేయి పైకెత్తి అభివాదం చేయించారు. ఆ సమయంలో చన్నీ.. సిద్ధూ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత రాహుల్‌ గాంధీ వచ్చి సిద్ధూ, చన్నీలను ఆత్మీయంగా హత్తుకున్నారు. అనంతరం చన్నీ మాట్లాడుతూ.. ‘‘సిద్ధూజీ.. మీ సూచనలను మేం అమలు చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

పంజాబ్‌లో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగింది. ముఖ్యంగా ఈ అభ్యర్థిత్వానికి పోటీ పడిన సిద్ధూ.. ఇటీవల సీఎం ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్‌ను టార్గెట్‌ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టాప్‌లో ఉన్నవారు బలహీనమైన వ్యక్తి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. అయితే పార్టీ నిర్ణయం ఏదైనా దాన్ని తాను స్వాగతిస్తానని చెప్పిన సిద్ధూ.. నిన్న కూడా మరోసారి అదే విషయాన్ని చెప్పారు. ‘‘నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు ఇవ్వకపోయినా.. తదుపరి సీఎంకు నేను మద్దతిస్తాను’’ అని అన్నారు. కానీ, చివర్లో తానేమీ షోపీస్‌ కాదని చెప్పడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles