దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో దేశంలో మూడవ విడత కరోనా మహమ్మారి పెద్దగా ప్రభావం చూపకుండానే అదృశ్యం కానుంది. అయితే మూడవ దశ తగ్గుముఖం పట్టి దేశవ్యాప్తంగా లక్ష లోపు కేసులు మాత్రమే నమోదు అవుతున్న క్రమంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ప్రపంచ అరోగ్య సంస్థ మరోమారు అప్రమత్తం చేసింది. మరో కరోనా వేరియంట్ వస్తే ఒమిక్రాన్ కంటే శరవేగంగా వ్యాప్తి చెందే ముప్పు ఉందని, అది వ్యాక్సిన్లకు లొంగదని డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక విభాగ చీఫ్ మరాయా వాన్ కెర్ఖోవ్ అన్నారు. ఇప్పటికే డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విజృంభించి వణికించాయి.
ఇప్పుడు మరో కొత్త వేరియంట్ పుట్టుకొస్తే వాటికంటే అధిక శక్తి సామర్థ్యాలు ఆ వేరియంట్‌కు ఉంటాయని కెర్ఖోవ్ చెప్పారు. కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్‌కు రోగ నిరోధక శక్తిని ఏమార్చే గుణం అధికంగా ఉండే ముప్పు ఉంటుందని వివరించారు. ఈ కారణం వల్లే ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లకు అది లొంగకపోవచ్చని తెలిపారు. ప్రపంచం ఇటువంటి స్థితిలోకి వెళ్లకూడదని కోరుకుందామని ఆమె అన్నారు. అటువంటి కొత్త వేరియంట్లు రాకుండా కరోనాను అరికట్టాలని ఆమె అన్నారు. అలాగే, కరోనా సీజనల్ వ్యాధిగానూ రూపాంతరం చెందే అవకాశాలూ ఉన్నాయని ఆమె చెప్పారు.
కరోనాను అరికట్టేంతవరకు నిబంధనలు పాటించాలని ఆమె చెప్పారు. మరోవైపు, కరోనా వ్యాప్తి అప్పుడే తగ్గినట్లు భావించకూడదని దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ హెచ్చరించారు. ఈ వైరస్ తిరగబెట్టడానికి వైరస్ మ్యుటేషన్లు కారణమని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను తొలిసారి గుర్తించి ఆమె ప్రపంచానికి ఈ విషయాన్ని తెలిపిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ కూడా మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని తప్పించుకుని వేగంగా వ్యాప్తి చెందిందని ఆమె గుర్తు చేశారు. కరోనా మరొక వేరియంట్ రూపంలో విరుచుకుపడొచ్చని ఆమె హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ, వ్యాక్సిన్లే వేసుకోవడమే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మనముందు ఉన్న అవకాశాలని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jun 27 | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే... Read more
Jun 25 | ‘పుష్ప’ సినిమాతో పాటు ఇప్పటికే పలు సినిమాల్లోనూ పోలీసుల కళ్లు గప్పి అక్రమార్గాలల్లో ఎలా సరుకు రవాణా చేయాలో అన్నది ఒక్కో దర్శకుడు ఒక్కో వినూత్న మార్గాన్ని చూపించారు. అయితే ఆ మార్గాలను అన్వయించుకుని,... Read more
Jun 25 | పామును తేలిగ్గా పట్టుకోవచ్చునని అనుకుంటారు కొందరు. స్నేక్ ఫ్ఱెండ్స్ లేదా స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకోవడం చూసి ఓస్ ఇంతేనా.. అని అనుకునేవారు.. తామేం తక్కువ అని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వాటిని పట్టుకోవడం... Read more
Jun 25 | తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తులపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులు తమ విధులకుహాజరుకాకుండా.. ఆయా స్థానాల్లో ఎవరో ఒకర్ని తమలా నటింపజేస్తూ.. వారు మాత్రం తమ... Read more
Jun 25 | విధి అడే వింత నాటకంలో అందరం పావులమే. అయితే.. ఎవరి ఆట ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ ఇది ముమ్మాటికీ నిజమని ఎవరైనా చెబితే ‘వేదాంతం’ మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తాం. అయితే నిజమని... Read more