Gurmeet Ram Rahim granted furlough for 21 days డేరాబాబాకు 21 రోజుల పేరోల్.. హర్యానా ప్రభుత్వం అనుమతి

Dera sacha sauda chief gurmeet ram rahim to leave prison after being granted furlough for 21 days

gurmeet ram rahim singh, baba ram rahim, ram rahim story, dera sacha sauda, ram rahim news, where is ram rahim now, gurmeet ram rahim singh news, gurmeet ram rahim singh cases, gurmeet ram rahim singh latest news, gurmeet ram rahim singh ji insan, Sunaria Jail, punjab assembly election, punjab polls, punjab election, punjab election 2022, punjab elections 2022, punjab polls 2022, punjab bjp, punjab congress, sacha sauda followers, dera followers, gurmeet ram rahim followers, dera baba, parole, Sunaria Jail, punjab polls, Haryana Govt, punjab, Politics

Shah Rukh Khan attended Lata Mangeshkar’s funeral at Shivaji Park ground in Mumbai. For a split second he removed his ask and did a facial gesture, which several ill-informed netizens deemed as ‘spitting’. The truth is that after saying a dua, Shah Rukh Khan blew air, which several Muslims follow as a pious practice.

డేరాబాబాకు 21 రోజుల పేరోల్.. హర్యానా ప్రభుత్వం అనుమతి

Posted: 02/07/2022 02:47 PM IST
Dera sacha sauda chief gurmeet ram rahim to leave prison after being granted furlough for 21 days

డేరా బాబాగా ఉత్తరాది రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో భక్తులను ఇప్పటికీ కలిగి ఉన్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు తాత్కాలిక ఊరట లభించనుంది. ఇవాళ ఆయన తన శిక్ష నుంచి తాత్కాలిక ఉపశమనంతో జైలు గోడల మధ్య నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోనున్నారు. రెండు దశాబ్దాల క్రితం నాటి తన మేనేజర్ హత్య కేసుతో పాటు ఇద్దరు మహిళలపై అత్యచారం చేశారన్న అభియోగాలను నిరూపితమై న్యాయస్థానం విధించిన జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసుల్లో రోహ్ తక్ లోని సునారియా జైల్లో డేరా బాబా జీవితఖైదును అనుభవిస్తున్నారు.

కాగా, డేరాబాబాకు తాజాగా 21 రోజుల పాటు పేరోల్ కు అనుమతిస్తూ తాత్కాలిక ఉపశమనాన్ని హర్యానా ప్రభుత్వం ఇవాళ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే సరిగ్గా అటు పంజాబ్, ఇటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయనకు పేరోల్ లభించడంపై రాజకీయ చర్చ జరుగుతోంది. కాగా డేరాబాబాకు పేరోల్ లభించడంలో వస్తున్న విమర్శలను హర్యానా ప్రభుత్వం తోసిపుచ్చింది. మూడేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్నా ఏ ఖైదీకైనా పేరోల్ హక్కులా లభిస్తోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే డేరాబాబాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక పర్యాయాలు పేరోల్ లభించిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో డేరా బాబాకు సెలవు మంజూరు చేయడం గమనార్హం. పంజాబ్ లో డేరా బాబాకు పెద్ద సంఖ్యలో మద్దతుదారులున్నారు. ఏ ఎన్నికలను అయినా వారు ప్రభావితం చేసేంత పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు రామ్ రహీమ్ కు చెందిన డేరా నేతలతో సాన్నిహిత్యంగా మెలుగుతుంటాయి. డేరా బాబా విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన అనుచరులు ఆనందంలో మునిగిపోయారు. ఆయనకు భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు వారు సిద్ధమవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles