Bride calls off wedding after groom throws varmala ఆ కారణంగా పెళ్లిపీటల మీద వివాహాన్ని అపేసిన వధువు

Bride calls off wedding after groom throws garland at her in uttar pradesh

bride calls off wedding, bride calls off ceremony, auraiya, uttar pradesh, bride calls off wedding after groom throws varmala at her, varmala, wedding rituals, wedding, Naveen Basti, Bidhuna police, viral news, trending news

An Uttar Pradesh bride called off her wedding after the groom threw the varmala at her, instead of putting it around her neck as per the tradition. The bride, from Auraiya district, refused to marry the groom after getting upset with his behaviour. The incident was reported from Naveen Basti under the Bidhuna police circle. After the bride refused to marry, both the families got into an argument.

వరమాల సరిగ్గా వేయలేదని.. పెళ్లిపీటల మీద వివాహాన్ని అపేసిన వధువు

Posted: 01/29/2022 05:31 PM IST
Bride calls off wedding after groom throws garland at her in uttar pradesh

ఇటీవలి కాలంలో వింత కారణాలతో ఆగిపోతున్న పెళ్లిళ్ల గురించి కథలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కూడా అలాంటిదే మరో ఘటన జరిగింది. ఔరాయా అనే ప్రాంతంలో పెళ్లి జరుగుతోంది. సంప్రదాయాల ప్రకారం ‘వరమాల’ కార్యక్రమం వరకూ పెళ్లి జరిగింది. ‘వరమాల’లో పెళ్లి కూతురు, వరుడు ఒకరి మెడలో ఒకరు పూలదండలు వేసుకోవాలి. ఈ సమయంలో వరుడు తన చేతిలోని దండను అమ్మాయి మెడలో వేయకుండా ఆమెపైకి విసిరాడని సమాచారం. ఇలా తనపైకి పూలదండ విసిరినందుకు ఆ వధువుకు కోపం వచ్చింది.

తాను ఈ పెళ్లి చేసుకోనంటూ తెగేసి చెప్పింది. ఎవరు ఎంత చెప్పినా ఆమె వినలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు వచ్చి విషయం తెలుసుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రెండు కుటుంబాలు కలిసి ఆ వధువును బతిమాలారు. కానీ ఆమె ఒక్క మెట్టు కూడా దిగలేదు. దీంతో పెళ్లి ఆపేయాల్సి వచ్చింది. పెళ్లికి ముందు ఇచ్చిపుచ్చుకున్న బహుమతులన్నింటినీ తీసుకొని రెండు కుటుంబాలు ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles