Cold wave in Telangana for next few days తెలంగాణకు మరో 3 రోజులు అరెంజ్ అలెర్ట్..

Hyderabad recorded the coldest day of winter min temp may drop below 10 c

Telangana weather, Telangana temperatures, Cold wave, Hyderabad, IMD, lowest temperature, TSDPS, Telangana State Development Planning Society, Hyderabad weather, Kumarambheem Asifabad, Dip in mercury, low temp in Telangana, Asifabad, Adilabad, Mancherial, Sangareddy, Patancheru, BHEL, Rajendranagar, Hyderabad, Telangana

Several parts of Telangana will experience severe cold wave conditions in the next few days due to the prevalence of north-easterlies over the State. According to the IMD, the minimum temperatures are likely to drop by 4°C in many pockets of the State. Mist/haze is very likely to prevail during the morning hours and surface winds are likely to be north-easterlies with wind speeds around 6-8 kmph.

పంజా విసురుతున్న చలి పులి.. తెలంగాణకు మరో 3 రోజులు అరెంజ్ అలెర్ట్..

Posted: 01/29/2022 06:23 PM IST
Hyderabad recorded the coldest day of winter min temp may drop below 10 c

రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతున్నది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోని 29 జిల్లాలో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. చలి తీవ్రతకు ప్రజలు వణుకుతున్నారు. ఖమ్మంలో11, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవగా.. ఆదిలాబాద్‌ జిల్లా అర్లి(టి)లో 4.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు దట్టంగా పొగమంచు కురుస్తున్నది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడకపోవడంతో ఎదుట ఏం ఉన్నదో తెలియని పరిస్థితి ఏర్పడింది. మంచుదుప్పటి కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లైట్లు వేసుకొని వాహనాలు నడుపాల్సి వస్తున్నది. ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావంతోనే తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

గత 20 సంవత్సరాల్లో ఇంత చలి తీవ్ర ఎప్పుడూ లేదని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి సంక్రాంతి పండుగ తర్వాత చలి క్రమంగా తగ్గుతూ వస్తున్నది.. కానీ, ఈ ఏడాది జనవరి చివరికి వస్తున్నా తీవ్రత తగ్గడం లేదు. ఆదివారం ఉదయం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. అలాగే మరో మూడు రోజులు రాష్ట్రంలో చలితీవ్రత ఉంటుందని తెలిపింది. ఉత్తరాధి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సైతం తక్కువగానే నమోదవుతున్నాయి.

మధ్యాహ్నం 12 గంటల వరకు చల్లగానే ఉంటుంది. సాయంత్రం 3 గంటల తర్వాత చలి ప్రారంభం అవుతున్నది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోతుండడంతో చలి పెరుగిందని, ప్రజలు జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే అత్యంత ఎక్కువగా నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 33.9 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గముఖం పడుతున్నాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో మళ్లీ చలి గాలులు విజృంభిస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం తెల్లవారుజామున చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ ఏడాది ఇదే అత్యల్పమని పరిశోధన స్థానం ఇన్‌చార్జి చెప్పారు. జి.మాడుగులలో 5.58, జి.కె.వీధిలో 5.72, అరకులోయలో 6.45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9 డిగ్రీలు, అరకులోయ కేంద్రం కాఫీబోర్డు వద్ద 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురవడంతో ఉదయం 9.30 గంటల వరకు ఏజెన్సీలోని అరకులోయ, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో సూర్యోదయం కాలేదు. మంచు తీవ్రత చలిగాలులతో వ్యవసాయ పనులు, వారపుసంతలకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచుతో పాడేరు, చింతపల్లి, అనంతగిరి ఘాట్‌ రోడ్లలో వాహన చోదకులంతా లైట్లు వేసుకునే వాహనాలు నడిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles